Begin typing your search above and press return to search.

ఒక్కటి క్యాన్సిల్‌.. రెండు కన్ఫర్మ్‌!

తమిళ స్టార్ హీరో సూర్య ఫ్యాన్స్ గత రెండేళ్ల నుంచి సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 July 2024 5:52 AM GMT
ఒక్కటి క్యాన్సిల్‌.. రెండు కన్ఫర్మ్‌!
X

తమిళ స్టార్ హీరో సూర్య ఫ్యాన్స్ గత రెండేళ్ల నుంచి సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. 2022 లో ఈటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య ఆ తర్వాత రెండు సినిమాల్లో గెస్ట్‌ రోల్స్ చేసినా ఫ్యాన్స్ మాత్రం పూర్తి స్థాయి సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.

సూర్య ఈ రెండేళ్ల గ్యాప్‌ లో కంగువా సినిమాను చేశాడు. తమిళ బాహుబలి అంటూ కంగువా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న కంగువా సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఇదే సమయంలో సూర్య రెండు సినిమాలకు కమిట్‌ అయ్యాడు.

కంగువా సమయంలోనే తనకు సూరారై పోట్రు తో సక్సెస్ ఇచ్చిన సుధ కొంగర తో ఒక సినిమాకు సూర్య ఒకే చెప్పాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. సుధా కొంగర సినిమా ఒక్కటి క్యాన్సిల్‌ అయితే సూర్య కొత్తగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ప్రముఖ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సూర్య 44 వ సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. ఆ సినిమాకు సంబంధిచిన షూటింగ్‌ ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పీడ్‌ గా చేయబోతున్నారు.

ఇటీవలే కన్నడ స్టార్‌ దర్శకుడు నర్థన్‌ దర్శకత్వంలో సూర్య ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఇదే ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి.

కన్నడ స్టార్ దర్శకుడు అయిన నర్థన్‌ తో సూర్య సినిమా అంటే కచ్చితంగా సౌత్‌ తో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సూర్య కంగువా సినిమా తో పాటు చేయబోతున్న ఈ రెండు సినిమాలు కూడా ఆయనకు హ్యాట్రిక్ విజయాలను అందించడం ఖాయం అనే అభిప్రాయం తో ఫ్యాన్స్ ఉన్నారు.