Begin typing your search above and press return to search.

ఆ హీరో నిర్ణ‌యం భార్య చేతిలోనా?

భార్య చెబితే విన‌కూడ‌దు అనే వ‌ర్గంతో పాటు అదే భార్య మాట వింటే త‌ప్పేంటి? అన్న‌వారు లేక‌పోలేదు

By:  Tupaki Desk   |   17 Jun 2024 11:30 PM GMT
ఆ హీరో నిర్ణ‌యం భార్య చేతిలోనా?
X

భార్య చెబితే విన‌కూడ‌దు అనే వ‌ర్గంతో పాటు అదే భార్య మాట వింటే త‌ప్పేంటి? అన్న‌వారు లేక‌పోలేదు. భ‌ర్త జీవితంలో స‌గ‌భాగం భార్య‌. అలాంట‌ప్పుడు వింటే త‌ప్పేముంది? అన‌డంలో త‌ప్పేంలేదు క‌దా. అక్కినేని అమ‌ల ఛారిటీ చేస్తోన్న సంపాద‌న అంతా నాగార్జున‌దే అన్న‌ది అంద‌రికీ తెలుసు. ఎన్ని స‌ర్వీసులైనా చేస్తుంది? ఎందుకంటే చెక్కులు మీద సంత‌కం పెట్టేది నేను క‌దా? అని ఓ సంద‌ర్భంలో స‌ర‌ద‌గా అన్నారు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ సైతం భార్య‌ని ఎలా మ్యానేజ్ చేయాలో ఓ టెక్నిక్ చెప్పారు. ఏం లేదు? భార్య‌ని చూసిన‌ప్పుడ‌ల్లా కోప్ప‌డ‌కుంటా న‌వ్వుతుంటే స‌రిపోతుంది. అంత‌కు మించి మ‌న‌మేం చేయాల్సిన ప‌నిలేద‌న్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం బ‌య‌ట పులి అయినా ఇంట్లో మాత్రం ప్ర‌తీ మ‌గాడు పిల్లే అన్న‌ట్లు స‌ర‌దాగా వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఇలా ఉండ‌టంలో తప్పేముంది? ఒంటెద్ది పోక‌డ‌తో ఉంటేనే స‌మ‌స్య‌ల‌న్ని వ‌స్తాయన్నారు.

తాజాగా కోలీవుడ్ స్టార్ సూర్య కూడా ఇదే లిస్ట్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. సూర్య ఏ ప‌ని చేయాలి అన్న ముందుగా జ్యోతిక అనుమ‌తి తీసుకుంటాడుట‌. తాను సొంతంగా ఓ నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత దాన్ని జ్యోతిక ముందు ఉంచుతాడుట‌. అటుపై ఇద్ద‌రు దాని మీద స‌మ‌గ్రంగా త‌ప్పొప్పుల‌ను విశ్లేషించుకుని ఓ నిర్ణ‌యానికి వ‌స్తారుట‌. ప్ర‌తీసారి సొంత నిర్ణ‌యాలు మంచిది కాద‌ని అంటున్నారు.

తీసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు సొంత నిర్ణ‌యాలు తీసుకుని..వీలు కుదిరిప్పుడల్లా వాటిని భార్య ముందుకు తీసుకెళ్తాడుట‌. ఆ విష‌యంలో జ్యోతిక ఎంతో సహ‌క‌రిస్తుందిట‌. స‌రైన నిర్ణ‌యం అయితే త‌న‌క‌న్నా ముందే ఆ ప‌ని తానే చేసేస్తుందిట‌. ఇప్ప‌టివ‌ర‌కూ త‌న నిర్ణ‌యాలేవి త‌ప్ప‌లేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం సూర్య పీరియాడిక్ చిత్రం `కంగువ‌`తో ప్రేక్ష‌కల ముందుకు రావ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న ప‌నుల్లో ఉంది.