సూర్య కంటే జ్యోతికకే ఆస్తులు ఎక్కువ!
సూర్య-జ్యోతిక జంట కలిసి 537 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. 2006లో వివాహం చేసుకున్న ఈ జంట ఇటీవలే ముంబైకి మకాం మార్చారు.
By: Tupaki Desk | 12 March 2024 10:30 AM GMTసీనియర్ హీరోయిన్ జ్యోతిక 'సైతాన్' చిత్రంతో ఘనమైన పునరాగమనాన్ని చాటుకుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. అయితే జ్యోతిక ఆస్తుల విలువ ఇటీవల అమాంతం పెరిగిందనేది ఒక సర్వే. జ్యోతిక తన భర్త సూర్యతో కలిసి పరిశ్రమలో పవర్ కపుల్‌గా ఉన్నారు. ఇద్దరు స్టార్లు పెద్ద తెరపై వెలుగుతున్నారు. సూర్య ప్రస్తుతం కంగువ విడుదల కోసం సిద్ధమవుతుండగా, మరోవైపు మమ్ముట్టి సరసన 'కథల్: ది కోర్'లో తన శక్తివంతమైన పాత్రతో గత సంవత్సరం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం జ్యోతిక తాజా చిత్రం 'సైతాన్' విజయాన్ని ఆస్వాధిస్తోంది. సైతాన్ కోసం 5 కోట్ల పారితోషికం అందుకుంది. జ్యోతిక - సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
సూర్య-జ్యోతిక జంట కలిసి 537 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. 2006లో వివాహం చేసుకున్న ఈ జంట ఇటీవలే ముంబైకి మకాం మార్చారు. ఈ జంట 70 కోట్ల విలువైన ఇంటిని కలిగి ఉన్నారు. వారి పిల్లలు ముంబైలోని పాఠశాలల్లో చేరారు. ఇటీవల ఈ ఇద్దరు తారలు హిందీ ప్రాజెక్ట్‌లపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. జ్యోతిక తదుపరి నెట్‌ఫ్లిక్స్‌లో 'డబ్బా కార్టెల్' అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది.
1998లో 'డోలీ సజకే రఖ్నా'తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జ్యోతిక ఇటీవల విడుదలైన హారర్ చిత్రం సైతాన్‌తో 26 సంవత్సరాల తర్వాత తిరిగి అడుగుపెట్టింది. చంద్రముఖి (మంజోలికా తమిళ వెర్షన్) పాత్ర పోషించిన జ్యోతిక అప్పట్లో హిందీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. జ్యోతిక నికర ఆస్తుల విలువ దాదాపు 331 కోట్లు. సూర్యతో కలిగి ఉన్న మొత్తం ఆస్తులలో 61.63 శాతం జ్యోతిక సొంతం.
సూర్య నికర ఆస్తుల విలువను గణిస్తే.. దాదాపు 206 కోట్లుగా ఉంది. తన తదుపరి చిత్రం కంగువ కోసం 30 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే సూర్య తన పారితోషికం విషయంలో చాలా స్థిరంగా ఉన్నాడు. గత 10 సంవత్సరాలలో దానిని పెద్దగా పెంచలేదు. అంతకుముందు 20-25 కోట్ల మధ్య వసూలు చేసేవాడు. సూర్య నికర ఆస్తుల విలువ 2014లో దాదాపు 125 కోట్లుగా ఉందని కథనాలొచ్చాయి. గత 10 సంవత్సరాలలో అతడి ఆస్తి దాదాపు 60 శాతం పెరిగింది.
జ్యోతిక - సూర్య జంటకు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. రూ.1.38 కోట్ల విలువైన BMW 7 సిరీస్ 730Ld కార్లు ఉన్నాయి. అతడి గ్యారేజీలో అత్యంత ఖరీదైన కారు ఇది. 80 లక్షల విలువైన ఆడి క్యూ7, 60.91 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ .. 1.10 కోట్ల విలువైన జాగ్వార్ ఎక్స్‌జె ఎల్‌ను కూడా కలిగి ఉన్నాడు. అదే సమయంలో ఈ దంపతుల చెన్నై ఇల్లు దాదాపు 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
అక్షయ్ కుమార్ 'సూరరై పొట్రు' హిందీ రీమేక్‌లో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. నిర్మాతగాను సూర్య కొన్ని హిందీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాడు. 'డబ్బా కార్టెల్' అనే వెబ్ సిరీస్‌లో జ్యోతిక కనిపించనుంది. సైతాన్ తర్వాత, ఆమె హిందీ చిత్రం 'శ్రీ'లో నటించనుంది. దీపిపి ఇంకా ప్రకటించలేదు.