ఆ స్టార్ హీరో రిలీజ్ కి ముందే ఓ చరిత్ర!
తొలిసారి 'కంగువా' కోసం స్టూడియో గ్రీన్- యూవీ క్రియేషన్స్ సంస్థలు ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తు న్నాయి
By: Tupaki Desk | 20 March 2024 7:07 AM GMT10 కాదు..20 కాదు..ఏకంగా 38 భాషల్లో సినిమా రిలీజ్ అవ్వడం అంటే చిన్న విషయమా? అందులోనూ ప్రపంచ వ్యాప్తంగా 30కి పై గా భాషల్లో అనువదించి రిలీజ్ చేయడం అంటే కత్తి మీద సాములాంటిందే? ఫలితం ఎలా ఉంటుందో తెలియకుండానే అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంటే అతి పెద్ద సవాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సూర్య కథానాయకుడిగా నటిస్తోన్న 'కంగువా' ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తుంది.
టీజర్ తో ఈ సినిమా ప్రపంచ భాషల్లోకి వెళ్లాల్సిన సినిమానే అనిపించింది. సోషియా ఫాంటసీ ..పిరియాడిక్ థ్రిల్లర్ గా శివ రూపొందిస్తున్న సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడుతున్నాయి. సూర్య లుక్..టీజర్ లో సన్నివేశాలు ప్రతీది కంగువాని అంతకంతకు పైకి లేపాయి. ట్రైలర్ తో సినిమాకి మరింత గొప్ప రీచ్ దక్కు తుందని అభిమానులు భావిస్తున్నారు. సూర్య కెరీర్ లో తొలి భారీ బడ్జెట్ చిత్రం ఇదే కావడం విశేషం. ఇంత వరకూ సూర్య నటించిన ఏ సినిమాకి వందల కోట్లు వెచ్చించ లేదు.
తొలిసారి 'కంగువా' కోసం స్టూడియో గ్రీన్- యూవీ క్రియేషన్స్ సంస్థలు ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తు న్నాయి. 38 భాషల్లో 3డి- ఐమాక్స్ టెక్నాలజీతో రిలీజ్ అవుతుంది. అలాగే మార్కెటింగ్‌లోనూ, విడుదలలో నూ సినిమా ఎన్నో హద్దులు దాటుతుందని తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 'కంగువా' తమిళ సినిమాకు ఎన్నో కొత్త తలుపులు తెరుస్తుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఒక సినిమాని పది భాషల్లో రిలీజ్ చేయడమే ఎంతో క ష్టమైన పని.
కానీ 'కంగువా' 38 భాషలంటే బ్యాకెండ్ లో ఎంత మంది వర్క్ చేస్తున్నారో గెస్ చేయోచ్చు. పాన్ ఇండియా వైడ్ లాంగ్వేజెస్ తో పాటు ప్రపంచ దేశాల్లో ఇంకా ఏఏ భాషల్లో రిలీజ్ అవుతుంది అన్న దానిపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. ఇంతవరకూ ఏ సినిమా ఇన్ని భాషల్లో రిలీజ్ అవ్వలేదు. ఆ రకంగా చూస్తే కంగువా రిలీజ్ కి ముందే ఓ చరిత్ర రాసిందని చెప్పొచ్చు.