సూర్య.. మళ్ళీ ఇన్నాళ్ళకు బెస్ట్ ఛాన్స్!
అందుకే సింగం సిరీస్ లాంటి యాక్షన్ ప్యాక్డ్ కథలు సూర్య నుంచి వచ్చాయి. జై భీమ్, ఆకాశం నీ హద్దురా లాంటి కంటెంట్ బేస్డ్ కథలు కూడా ఊపిరి పోసుకున్నాయి.
By: Tupaki Desk | 9 April 2024 12:30 PM GMTకోలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు సూర్య. కమర్షియల్ హీరోగా చేయాలన్న, డిఫరెంట్ కథలతో ప్రేక్షకులని థ్రిల్ చేయాలన్న సూర్య ముందుంటాడు. అందుకే సింగం సిరీస్ లాంటి యాక్షన్ ప్యాక్డ్ కథలు సూర్య నుంచి వచ్చాయి. జై భీమ్, ఆకాశం నీ హద్దురా లాంటి కంటెంట్ బేస్డ్ కథలు కూడా ఊపిరి పోసుకున్నాయి.
ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా రిప్రజెంట్ చేసుకోవడంలో సూర్య ముందు వరుసలో ఉంటాడు. అయితే సూర్య కెరియర్ లో భారీ హైప్ క్రియేట్ చేసిన మూవీ అంటే 7th సెన్స్ అని చెప్పాలి. అప్పట్లో సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉండేది. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో అంతకుముందు గజిని అనే సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అలాంటి కాంబినేషన్ లో తెరకెక్కిన 7th సెన్స్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
వండర్స్ క్రియేట్ చేస్తుందని అనుకుంటే యావరేజ్ టాక్ తో బయటపడింది. ఆ తరువాత 24, సింగం అంటూ ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేసినా వర్కౌట్ కాలేదు. ఎన్ని ప్రయోగాలు చేస్తున్న సూర్య మార్కెట్ లో మాత్రం తన కెరీర్ ను మరో లెవెల్ కు పెంచుకునేలా హిట్ కొట్టలేకపోతున్నాడు. ఇక మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సూర్య కెరియర్ లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న మూవీ అంటే కంగువ అని చెప్పాలి.
శివ దర్శకత్వంలో కంప్లీట్ పీరియాడికల్ జోనర్ లో ఫిక్షనల్ కాన్సెప్ట్ తో టైం ట్రావెల్ థీమ్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా సిద్ధమవుతోన్న ఈ సినిమా రెండు డిఫరెంట్ టైం లైన్స్ లో జరుగుతుందంట. ఒక క్యారెక్టర్ లో సూర్య ఆటవిక వీరుడిగా ఉంటాడు. అలాగే మరోవైపు ఫ్యూచర్ లో ఒక పవర్ఫుల్ హీరోగా కూడా కనిపించనున్నాడు.
ఒక పాత్ర మాత్రం నెగిటివ్ షేడ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ పాత్రకి సంబందించిన సీక్వెన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. ఇక సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతుందని తాజాగా రిలీజ్ అయిన టీజర్ తో స్పష్టం అయ్యింది. ఈ టీజర్ లో సూర్య క్యారెక్టరైజేషన్, ప్రెజెంటేషన్ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పాలి. కచ్చితంగా సూర్య కెరియర్ లో గుర్తుండిపోయే పాత్ర ఇందులో చేయబోతున్నాడని అర్ధమవుతోంది. అలాగే టీజర్ తో మూవీ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే సూర్య ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
డైరెక్టర్ శివ కూడా కంగువలో సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడు. అడవిజాతుల మధ్య జరిగిన ఆధిపత్యపోరుని ఈ కథలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. ఇక 7th సెన్స్ తో పెద్దగా వందర్స్ క్రియేట్ చేయలేకపోయిన సూర్య ఈసారి అలాంటి బజ్ క్రియేట్ చేసుకున్న కంగువా తో ఒక మంచి ఛాన్స్ దొరికింది. మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.