Begin typing your search above and press return to search.

ఆ సినిమాలో రోలెక్స్ క్యారెక్టరా?

కోలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని అందుకోలేదు. తమిళంలో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ శంకర్ 2.ఓ పేరు మీద ఉంది

By:  Tupaki Desk   |   22 July 2024 1:09 PM GMT
ఆ సినిమాలో రోలెక్స్ క్యారెక్టరా?
X

కోలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని అందుకోలేదు. తమిళంలో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ శంకర్ 2.ఓ పేరు మీద ఉంది. దాని తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీ 600+ కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. దళపతి విజయ్ లియో మూవీ 500+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకుంది. అయితే ఏ సినిమా కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరలేదు. కానీ ఈ ఏడాది కోలీవుడ్ నుంచి రాబోతున్న స్టార్ హీరో సూర్య మూవీ కంగువ 1000 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. చిత్రంలో సూర్య రెండు భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. అలాగే టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఓ క్యారెక్టర్ లో ట్రైబల్ వారియర్ గా సూర్య పాత్ర చాలా భయంకరంగా ఉంది. ఆ క్యారెక్టర్ ఇప్పటికే ప్రేక్షకుల మైండ్ లలోకి బలంగా వెళ్ళిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా నెక్స్ట్ లెవల్ లో ఉందనే మాట వినిపిస్తోంది.

యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా రెడీ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కంగువ మూవీలో సూర్య రోలెక్స్ క్యారెక్టర్ ఉందనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్ ని సృష్టించారు. ఈ క్యారెక్టర్ లో ప్రతినాయకుడిగా సూర్య పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో నటించి మెప్పించాడు. విక్రమ్ సినిమాని రోలెక్స్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్ళింది.

ఆ రోలెక్స్ క్యారెక్టర్ రిఫరెన్స్ లోనే శివ ఈ సినిమాలో సూర్యని పాత్రలో చూపించబోతున్నాడు. ఈ మూవీలో ప్రెజెంట్ తో పాటు 1500 సంవత్సరాల క్రితం కథని కలిపి 2 డిఫరెంట్ టైం లైన్స్ చూపించబోతున్నారంట. ప్రెజెంట్ లో ఉండే సూర్య పాత్ర రోలెక్స్ క్యారెక్టర్ రిఫరెన్స్ తోనే డిజైన్ చేసారంట. ఈ క్యారెక్టర్ లో హీరో రోలెక్స్ వాచ్ ధరించడంతో పాటు అతని ఆహార్యం, లుక్ కూడా రోలెక్స్ తరహాలోనే ఉంటుందంట. అయితే క్యారెక్టర్ నెగిటివ్ టచ్ లో ఉంటుందా, పాజిటివ్ గా ఉంటుందా అనేది క్లారిటీ లేదు.

కంగువ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుంన్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా 300+ కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ నుంచి ఈ ఏడాది రాబోతోంది భారీ బడ్జెట్ సినిమా ఇదే అని తెలుస్తోంది. కంగువ మూవీతో 1000 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టలేకపోతే మళ్ళీ తమిళ్ ఇండస్ట్రీ ఆ కలెక్షన్స్ ని అందుకోవడానికి మరింత సమయం వేచి చూడాల్సిందే.