Begin typing your search above and press return to search.

సూర్య‌-కార్తీ భారీ పాన్ ఇండియా చిత్రం షురూ!

స్టార్ బ్ర‌ద‌ర్స్ సూర్య‌-కార్తీ ఒకే ప్రేమ్ లో క‌నిపించ‌బోతున్నారా? ఇద్ద‌రి కాంబినేష‌న్ లో భారీ పాన్ ఇండియా చిత్రానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   18 Sep 2023 12:40 PM GMT
సూర్య‌-కార్తీ భారీ పాన్ ఇండియా చిత్రం షురూ!
X

స్టార్ బ్ర‌ద‌ర్స్ సూర్య‌-కార్తీ ఒకే ప్రేమ్ లో క‌నిపించ‌బోతున్నారా? ఇద్ద‌రి కాంబినేష‌న్ లో భారీ పాన్ ఇండియా చిత్రానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయా? అంటే అవున‌నే తెలుస్తోంది. అన్న‌ద‌మ్ములిద్ద‌రు ఒకే సినిమాలో ఎప్పుడు క‌నిపిస్తార‌ని కోలీవుడ్...టాలీవుడ్ అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇంత‌కాలం ఇదిగో చేస్తున్నారు...అదిగో చేస్తున్నారు! అన్న ప్ర‌చారం త‌ప్ప బ్ర‌ద‌ర్స్ చేతులు క‌లిపింది లేదు.

తాజాగా ఈ ద్వ‌యం వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని కార్తీ రివీల్ చేసారు. 'ఇద్ద‌రు క‌లిసి ప‌నిచేస్తున్నారా? అన్న ప్ర‌శ్న‌కు కార్తి అవున‌ని స‌మాధానం చెప్పారు. ' అన్న‌ద‌మ్ములిద్ద‌రు ఒకే ఇండ‌స్ట్ర‌లో ఉండ‌టం అన్న‌ది చాలా అరుదు. ఇద్ద‌రం క‌లిసి ఓ సినిమా చేయాల‌ని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. మొద‌ట ఈ విష‌యంలో భ‌య‌ప‌డ్డాను.

కానీ ఇప్పుడు మాత్రం త‌ప్ప‌కుండా అన్న‌య్య‌తో సినిమా చేయాలి నిర్ణ‌యించుకున్నా. నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టం. సినిమాలు నాకు ఆ అవ‌కాశాన్ని క‌ల్పించాయి. ప్ర‌తీ సినిమాలోనూ స‌వాల్ తో కూడిన పాత్ర‌ల్లో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. అనుకోకుండా నటుడిని అయ్యాను. తొలుత నాకు ద‌ర్శ‌కుడు అవ్వాల‌నే కోరిక ఉండేది. కానీ మా నాన్న 60 వ‌య‌సులోనూ ద‌ర్శ‌కుడు కావొచ్చు. న‌ట‌న‌కంటూ ఓ వ‌య‌సు ఉంటుంది. ఆ వ‌య‌సులోనే న‌టించాలి అని నాన్న చెప్ప‌డంతో నిర్ణ‌యం మార్చుకున్నా. న‌టుడిగా ఎంట్రీ ఇచ్చినంద‌కు అన్ని ర‌కాల పాత్ర‌ల‌తోనూ ప్రేక్ష‌కుల్ని మెప్పించాలి' అని అన్నారు.

ఇక అన్న‌ద‌మ్ములిద్ద‌రు సై అనేసారు కాబ‌ట్టి అది కచ్చితంగా పాన్ ఇండియా సినిమానే అవుతుంది. ఇద్ద‌రికీ తెలుగు..త‌మిళ్ లో మంచి మార్కెట్ ఉంది. ప్ర‌స్తుతం ట్రెండ్ పాన్ ఇండియాదే కాబ‌ట్టి. బ్ర‌ద‌ర్స్ ఆ త‌ర‌హా కంటెంట్ తోనే సినిమా చేసే అవ‌కాశం ఉంది. అది 2024లో సాధ్య‌మ‌వ్వాల‌ని ఆశిద్దాం. మ‌రి అన్న‌ద‌మ్ముల్ని డైరెక్ట్ చేసే ఆ అదృష్ట వంతుడు ఎవ‌రు అవుతారో చూడాలి.