ఆ స్టార్ హీరో తప్పుకున్నాడా? తప్పించారా?
అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం సూర్య ఎగ్జిట్ అయిన మాట వాస్తవమేనని తెలుస్తోంది.
By: Tupaki Desk | 2 Jun 2024 11:30 AM GMTసూర్య-బాల దర్శకత్వంలో 'వణాంగన్' అనే సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇద్దరు చాలా కాలం తర్వాత చేతులు కలపడంతో ఆ కాంబినేషన్ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. 'వణాంగన్' ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే సూర్య ఈ సినిమా నుంచి అనివార్య కారణాలతో తప్పుకున్నట్లు కూడా వార్తలొ చ్చాయి. కానీ అందులో ఎంతవరకూ నిజమో క్లారిటీ లేదు. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం సూర్య ఎగ్జిట్ అయిన మాట వాస్తవమేనని తెలుస్తోంది.
సూర్య స్థానంలో అరుణ్ విజయ్ ని హీరోగా ఎంపిక చేసి షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆ మద్య అరుణ్ విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. అయితే ఇది ప్యాన్ మేడ్ పోస్టర్ అని సూర్య తప్పుకోలేదని సూర్య వర్గం వాదించింది. కానీ అదంతా అవాస్తవమేనని చిత్ర యూనిట్ అధికారికంగా ఆ పోస్టర్ రిలీజ్ చేసినట్లు తర్వాత క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జులైలో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఈ సినిమా నుంచి సూర్య తప్పుకున్నాడా? తప్పించారా? అన్నది మళ్లీ కోలీవుడ్ మీడియాలో చర్చనీ యాంశంగా మారింది. కానీ సూర్య సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం సూర్య కావాలనే ఈ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయినట్లు చెబుతున్నారు. బాల షూటింగ్ డిలే చేయడంతో సూర్య కమిట్ అయిన మిగతా చిత్రాలకు ఇబ్బంది కలగడంతో తప్పుకున్నట్టు వినిపిస్తుంది. సూర్య అసౌకర్యాన్ని బాలకి రెండు..మూడు సార్లు చెప్పినా కేటాయించిన డేట్లు ప్రకారం షూటింగ్ చేయకపోవడంతో విసుగు చెంది సూర్యనే స్వచ్ఛందంగా ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది.
అలాగే అడ్వాన్స్ గా తీసుకున్న పారితోషికం కూడా నిర్మాణ సంస్థకు తిరిగి ఇచ్చేసారుట. బాలతో ఈ రకమైన ఇబ్బందులు హీరోలు ఎదుర్కోవడం కొత్తేం కాదు. గతంలో విక్రమ్ కూడా తనయుడు సినిమా విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ ఎదుర్కున్నాడు. తెలుగు సినిమా 'అర్జున్ రెడ్డి'ని కుమాడిరితో విక్రమ్ 'ఆదిత్య వర్మ' టైటిల్ తో బాల దర్శకత్వంలో పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో బాల మధ్యలోనే ప్రాజెక్ట్ వదిలేసాడు. ఆ తర్వాత విక్రమ్ ...బాల స్థానంలోకి మరో దర్శకుడిని తీసుకొచ్చి పూర్తి చేయించాడు. ఇంకా మరికొంత మంది నిర్మాతల్లోనూ బాల వైఖరి పట్ల అసంతృప్తి తెరపైకి వచ్చిన సందర్భాలెన్నో.