Begin typing your search above and press return to search.

ఎస్ జే సూర్య.. ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే..

అలా టాలీవుడ్, కోలీవుడ్ లో దర్శకుడిగా ప్రత్యేక పేరు సంపాదించుకున్నారు.

By:  Tupaki Desk   |   30 Aug 2024 5:07 PM GMT
ఎస్ జే సూర్య.. ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే..
X

ఎస్ జే సూర్య.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. అయితే ఆయన పేరు చెబితే చాలు.. అందరికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఖుషినే గుర్తొస్తోంది. అప్పట్లో టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అయిన ఆ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు సూర్య. కోలీవుడ్ లో అజిత్ వాలితో తన మార్క్ డైరెక్షన్ చూపించారు. అలా టాలీవుడ్, కోలీవుడ్ లో దర్శకుడిగా ప్రత్యేక పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత నటుడిగా సూర్య పాపులర్ అయ్యారు.

దీంతో నెమ్మదిగా అందరి దర్శకుల కళ్ళు సూర్య పై పడ్డాయి. ఇంకేముంది.. అవకాశాలే అవకాశాలు. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. విలన్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారారు. సైకో విలన్ పాత్రల్లో అద్భుతంగా నటించి అందరినీ ఫిదా చేశారు. నెంజం మరప్పతిల్లై, మానాడు వంటి పలు సినిమాల్లో సూర్య యాక్టింగ్ అదుర్స్ అనే చెప్పాలి. తాజాగా నాని సరిపోదా శనివారం మూవీలో సైకో తరహా ఇన్స్పెక్టర్ దయానంద పాత్రలో అదరగొట్టేశారు.

క్రూరత్వం ప్రదర్శిస్తూ, తన చూపులతోనే భయపెడుతూ సినీ ప్రియులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నారు. ఆ పాత్రకు తాను తప్ప ఎవరూ సెట్ కారన్న విధంగా మెప్పించారు. ఇప్పుడు టాలీవుడ్ లో మరింత ఫేమస్ అయ్యారు. వేరే లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. అదే సమయంలో ఆయన అప్ కమింగ్ మూవీస్ పై అందరి దృష్టి నెలకొంది. తన కొత్త చిత్రాలతో ఎస్ జే సూర్య ఎలా అలరించనున్నారో చూసేందుకు వెయిట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో సినీ ప్రియులు చెబుతున్నారు.

అయితే తెలుగులో ప్రస్తుతం ఎస్ జే సూర్య గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. స్టార్ హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న ఆ సినిమా.. త్వరలో విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్.. డిసెంబర్ చివర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ సినిమాలో సూర్య.. విలన్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఆయన రోల్ పై దర్శకుడు శంకర్ మంచి హైప్ క్రియేట్ చేశారు. చరణ్, సూర్య మధ్య సీన్స్.. ఆడియన్స్ ను మెప్పించనున్నాయని తెలిపారు.

వారిద్దరి మధ్య సీన్స్ తనకు చాలా నచ్చినట్లు కమల్ హాసన్ భారతీయుడు-2 మూవీ ప్రమోషన్స్ లో శంకర్ చెప్పి బజ్ సృష్టించారు. అయితే భారతీయుడు-2లో సూర్య నటించినా.. కాస్త సమయమే స్క్రీన్ పై కనిపించారు. కానీ భారతీయుడు-3లో ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు వివిధ చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే వరుస హిట్లు అందుకుంటే ఆయన రేంజే మారిపోతుంది. మరి ఎస్ జే సూర్య కొత్త సినిమాల్లో ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.