సూర్య ‘రెట్రో’ - సూర్య కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే?
ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. సూర్య, పూజా కాంబినేషన్ కొత్తది కావడంతో వారి కెమిస్ట్రీ ఎలా ఉంటుందనేదానిపై అంచనాలు పెరిగాయి.
By: Tupaki Desk | 9 March 2025 6:00 PM ISTసూర్య మళ్లీ తన కెరీర్‌లో మునుపటి తరహాలో బిగ్ సక్సెస్ అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వరుసగా కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోకపోయినా, ఇప్పుడు 'రెట్రో'తో మళ్లీ తన మార్క్‌ను రిపీట్ చేయాలని చూస్తున్నాడు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే అనేక ఊహాగానాలకు కేంద్రంగా మారింది. మొదట్లో అందరూ గ్యాంగ్‌స్టర్ మూవీగా భావించిన ఈ చిత్రం, ఇప్పుడు లవ్, యాక్షన్ మిక్స్‌గా సెట్ చేయబడిందని బయటకొచ్చిన అప్‌డేట్స్ తెలియజేస్తున్నాయి.
ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కార్తిక్ సుబ్బరాజ్, తన సినిమాల్లో యూనిక్ కాన్సెప్ట్‌లతో ప్రయోగాలు చేసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. సూర్యతో కలిసి ఈసారి ఓ డిఫరెంట్ జోనర్ టచ్ చేయడం, రొమాన్స్, యాక్షన్ కలబోసిన కథను ఎంచుకోవడం ఆసక్తిని పెంచుతోంది. మే 1న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని చిత్రబృందం తెలిపింది.
సూర్య కెరీర్‌లో రొమాంటిక్ డ్రామాలు, ఇంటెన్స్ యాక్షన్ పాత్రలు రెండు విభిన్న కోణాల్లో ఉంటాయి. కానీ ‘రెట్రో’ మాత్రం ఈ రెండింటినీ కలిపిన కథతో వస్తోంది. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో “సినిమా ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. సూర్య సార్ పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు” అంటూ చెప్పిన మాటలు మూవీపై మరింత ఆసక్తిని పెంచేశాయి. సినిమాలోని రెండో పాట త్వరలో విడుదల కానుందని కూడా వెల్లడించారు.
ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. సూర్య, పూజా కాంబినేషన్ కొత్తది కావడంతో వారి కెమిస్ట్రీ ఎలా ఉంటుందనేదానిపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీకి సంగీతం అందిస్తున్న సంజయ్ నారాయణ్, ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌తో మంచి బజ్ క్రియేట్ చేయగా, త్వరలో వచ్చే రెండో పాట మరింత హైప్‌ను పెంచే అవకాశముంది. ఇక రొమాన్స్, యాక్షన్‌ను మిక్స్ చేసిన ఈ సినిమాకు మరో ప్రత్యేకతగా శ్రియ సరన్ ప్రత్యేక సాంగ్‌లో కనిపించనుంది. ఆమె గ్లామర్‌తో పాటు డాన్స్ మూమెంట్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయట. అలాగే, ప్రముఖ నటులు జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సూర్య, జ్యోతిక సంయుక్తంగా 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.