ఒకే ఇంట్లో ఉన్నా కలవడానికి 18 ఏళ్లు...!
తమిళ స్టార్ కపుల్ సూర్య - జ్యోతిక ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉన్నారు.
By: Tupaki Desk | 19 April 2024 10:30 AM GMTతమిళ స్టార్ కపుల్ సూర్య - జ్యోతిక ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉన్నారు. ఆ మధ్య ఇద్దరు విడి పోయారు అందుకే జ్యోతిక ముంబైలో, సూర్య చెన్నైలో ఉంటున్నారు అనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారంకు చెక్ పెట్టే విధంగా ఇద్దరు కలిసి విహార యాత్రలకు వెళ్లడం, ఆ ఫోటోలను షేర్ చేయడం జరిగింది.
కుటుంబ అవసరాలు మరియు కెరీర్ విషయంలోనే జ్యోతిక ముంబైలో ఉంటున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. 2006 లో ప్రేమ వివాహం చేసుకున్న జ్యోతిక కొన్నాళ్లు సినిమాలకు దూరం అయ్యింది. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత జ్యోతిక మళ్లీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.
పెళ్లికి ముందు సూర్యతో కలిసి ఏకంగా ఏడు సినిమాల్లో నటించిన జ్యోతిక రీ ఎంట్రీ తర్వాత మాత్రం ఇప్పటి వరకు కలిసి నటించలేదు. వీరిద్దరి కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న సూర్య, జ్యోతికలను మళ్లీ స్క్రీన్ పై కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
గత 18 ఏళ్లుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వారి ఎదురు చూపులకు తెర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఒక సినిమా రాబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ తమిళ మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తున్నాయి.
అంజలి మీనన్ లేదా హలితా షమీమ్ లలో ఒకరు సూర్య, జ్యోతిక సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఇప్పటి వరకు చర్చల దశలో ఉన్న ఈ సినిమా గురించి అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన వస్తుందని తమిళ మీడియా వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.