సూర్య రక్తదానం...ఇచ్చిన మాటకు కట్టుబడి!
ఇక ప్రతీ ఏటా అభిమానుల సూర్య పుట్టినరోజును తమిళనాడులో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
By: Tupaki Desk | 16 July 2024 10:04 AM GMTకోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో భారీ అభిమానులను కలిగిన స్టార్ సూర్య. ఆయన సినిమాలంటే అభిమానించే వారు ఎంతో మంది. ఇక వ్యక్తిగతంగా ఆయన సేవాకార్యక్రమాలు, ఛారిటీల పట్ల సూర్య చొరవ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా కంటే ఛారిటీ ఈవెంట్ల ద్వారా అభిమానుల హృదయాలకు మరింత దగ్గరైన స్టార్ అతను. ఇక ప్రతీ ఏటా అభిమానుల సూర్య పుట్టినరోజును తమిళనాడులో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహి స్తుంటారు. గత ఏడాది ఏకంగా 2000 మంది రక్తదానం చేసారు. ఇది చూసి సూర్య చలించిపోయాడు. అభిమానంతో ఇంతమంది రక్తదానం చేసారా? అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనపై ఎందుకింత ప్రేమ చూపిస్తున్నాడని ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలోనే 2024 పుట్టిన రోజు వేడుకలకు తాను సైతం అభిమానులందరితో కలిసి రక్త దానం చేస్తానని ప్రామిస్ చేసారు.
తాజాగా జులై 23న పుట్టిన రోజు వస్తోన్న సందర్భంగా చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో సూర్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన రక్తదాని శిబిరాన్ని సందర్శించాడు. సూర్యతో పాటు సుమారు 500 మందికి పైగా రక్తదానం చేసారు. ఈ కార్యక్రమం మరో పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఏడేళ్ల క్రితం సూర్య బర్త్ డే కి అభిమానులంతా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన పిల్లలకు బంగారు ఉంగరాలు అందజేసారు.
ఆ ఏడాది భారీ ఎత్తున అన్నదాన, రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలా సూర్య అభిమానులు తొలి నుంచి సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అభిమానుల పెళ్లిళ్లకు సైతం సూర్య స్వయంగా హాజరవుతుంటారు. అలాగే కార్తీ కూడా అంతే చొరవతో ఉంటారు. ఇంకా విజయ్, విశాల్ అభిమానులు కూడా ఇదే తీరున సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు.