Begin typing your search above and press return to search.

నిర్మాత నాగవంశీ చెల్లి.. ఫస్ట్ మూవీతోనే సక్సెస్​..

అలాగే తనకు మద్దతుగా నిలిచిన నాన్నకు, అన్నయ్యకు కూడా స్పెషల్​ థ్యాంక్స్ అని చెప్పింది.

By:  Tupaki Desk   |   10 Oct 2023 1:37 PM GMT
నిర్మాత నాగవంశీ చెల్లి.. ఫస్ట్ మూవీతోనే సక్సెస్​..
X

చిత్ర సీమలో ఏ విభాగానికి చెందిన వారి వారసులైన హీరోహీరోయిన్లుగానే రాణించాలని ఎక్కువగా ఆశపడుతుంటారు. చాలా తక్కువ మంది ఇతర విభాగాల్లో రాణించేందుకు ఆసక్తి చూపుతారు. పైగా అందులోనూ ఓ నిర్మాత కూతురు నిర్మాతగా మారడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదే సందర్భం చోటు చేసుకుంది. పైగా తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకుంది.

ఇంతకీ ఆమె ఎవరంటే.. సూర్యదేవర హారిక. హారిక అండ్​ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత చినబాబు పెద్ద కుమార్తెనే హారిక. ఇటీవలే ఆమె.. మ్యాడ్ సినిమాతో నిర్మాతగా మారింది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు నిర్మాత బాధ్యతలు తీసుకుంది.సాధారణంగా నిర్మాత అంటే.. వయసు, అనుభవంతో పాటు ఎన్నో తెలివి తేటలు ఉండాలి. కానీ హారిక మాత్రం చిన్న వయసులోనే నిర్మాత బాధ్యతలు తీసుకుని..తన తండ్రి చినబాబు, అన్న నాగవంశీ గర్వపడేలా చేసింది.

వారిద్దరి ధైర్యంతో ఓ అడుగు ముందుకు వేసి తొలి ప్రయత్నంలోనే సక్సెస్​ను అందుకుంది. దీంతో ఇప్పటివరకు మీడియా ముందుకు రాని ఈమె.. మ్యాడ్ సక్సెస్ మీట్​లో తొలి సారిగా కెమెరా ముందుకు వచ్చింది మాట్లాడింది. తొలిసారి కావడం వల్ల మైక్ పట్టుకొని కాస్త తడబడుతూనే తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆమె పక్కనే అన్నయ్య నాగవంశీ కూడా ఉండి సపోర్ట్ చేసారు.

ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. మ్యాడ్​ను ఆదరిస్తున్నందుకు సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ, అలాగే ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అలాగే తనకు మద్దతుగా నిలిచిన నాన్నకు, అన్నయ్యకు కూడా స్పెషల్​ థ్యాంక్స్ అని చెప్పింది.

అయితే ఈమె మాట్లాడిన మాటలు, ఫొటోలు, వీడియోలో బయటకు రావడంతో సోషల్ మీడియాలో కాస్త వైరల్​గా మారింది. ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భలే అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

కాగా, హారిక బ్యానర్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాను నిర్మిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్​ బాబు హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది రిలీజ్ కానుంది.