రామ్ చరణ్ నిజంగా కింగ్: SJ సూర్య
మొట్టమొదటి సారి ఒక తెలుగు మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ యూఎస్ నిర్వహించారు.
By: Tupaki Desk | 22 Dec 2024 7:14 AM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' మూవీ జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని నిర్మాత దిల్ రాజు గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. యూఎస్ లో డల్లాస్ వేదికగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సినిమాకి వర్క్ చేసిన యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. మొట్టమొదటి సారి ఒక తెలుగు మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ యూఎస్ నిర్వహించారు.
ఈ సినిమాలో నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. అతని పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ లో ఎస్ జె సూర్య మాట్లాడుతూ రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించాడు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నిజంగా కింగ్ అని అన్నారు. ఆయన ప్రవర్తన, నడక, నడత, బిహేవియర్, నటన అన్ని కింగ్ లా ఉంటాయి. అందుకే నేను అతని నెంబర్ ని RC ది కింగ్ అని మొబైల్ లో సేవ్ చేసుకున్నాను అని సూర్య అన్నారు.
ఈ సినిమాలో పాత్ర నా మనసుకి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే తెలుగు, తమిళ్, హిందీ భాషలలో నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని అన్నారు. అలాగే ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మూవీ టీమ్ మెంబర్స్ తో కలిసి స్టేజ్ పైన రా మచ్చా మచ్చా సాంగ్ కి స్టెప్పులు వేసి ఆహుతులని ఎంటర్టైన్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్టేజ్ పైకి రామ్ చరణ్ ఎంట్రీ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. తరువాత మచ్చా మచ్చా సాంగ్ కి స్టెప్పులు వేశారు. డల్లాస్ వేదికగా ఈవెంట్ జరిగిన కూడా పెద్ద ఎత్తున అభిమానులు, సాధారణ సినీ ప్రేమికులు హాజరు కావడం విశేషం. ఇక సుకుమార్, బుచ్చిబాబు కూడా ఈ ఈవెంట్ కి గెస్ట్ లుగా వచ్చి రామ్ చరణ్ గురించి, 'గేమ్ చేంజర్' మూవీ గురించి మాట్లాడారు.
చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్ తో మూవీ పట్టాలు ఎక్కనుంది. 'పుష్ప 2'తో సక్సెస్ అందుకొని ఉన్న సుకుమార్ ని ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పిలవడం ద్వారా సినిమాకి బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ కూడా సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసేలా ఉంటోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.