Begin typing your search above and press return to search.

హిట్ సినిమా సీక్వెల్‌ లో క్రేజీ స్టార్‌...!

2022 లో విడుదల అయిన సర్దార్‌ మూవీ సూపర్‌ హిట్‌ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా సీక్వెల్‌ గురించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   16 July 2024 8:49 AM GMT
హిట్ సినిమా సీక్వెల్‌ లో క్రేజీ స్టార్‌...!
X

కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన 'సర్దార్‌' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 2022 లో విడుదల అయిన సర్దార్‌ మూవీ సూపర్‌ హిట్‌ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా సీక్వెల్‌ గురించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దర్శకుడు మిత్రన్‌ సీక్వెల్‌ ఉంటుందని ప్రకటించడం, ఇటీవల షూటింగ్ కూడా మొదలు పెట్టడం జరిగింది.

సర్దార్‌ ను ఒక మీడియం రేంజ్ సినిమాగా రూపొందించిన మిత్రన్‌ సర్దార్ 2 ను మాత్రం భారీ బడ్జెట్‌ తో రూపొందిస్తున్నాడు. భారీ స్టార్‌ కాస్టింగ్ తో పాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది. తమిళ స్టార్‌ నటుడు ఎస్ జే సూర్య ఈ సినిమా షూట్‌ లో జాయిన్ అయ్యాడు.

దర్శకుడిగా ఎన్నో సూపర్‌ హిట్స్ ను దక్కించుకున్న ఎస్ జే సూర్య ఈ మధ్య కాలంలో నటుడిగా చాలా బిజీ అయ్యాడు. ఏడాదికి నాలుగు అయిదు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. తాజాగా ఇండియన్‌ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్వరలో గేమ్‌ ఛేంజర్ సినిమాతో రాబోతున్న విషయం తెల్సిందే.

ఇప్పుడు సర్దార్‌ 2 సినిమాలో కూడా నటిస్తూ ఉన్నాడు. సూర్య ఇప్పటికే విలక్షణ నటుడు అనే ట్యాగ్‌ లైన్ ను సొంతం చేసుకున్నాడు. కార్తీ కి గట్టి పోటీ ఇచ్చే విలన్‌ పాత్ర లో సూర్య ను చూడబోతున్నామని తమిళ మీడియా వర్గాలతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ మధ్య కాలంలో సీక్వెల్స్ కి మంచి స్పందన లభిస్తోంది. ఇలాంటి సమయంలో మిత్రన్‌ సూపర్ హిట్‌ మూవీ 'సర్దార్‌' కి సీక్వెల్‌ ను చేయడం చాలా మంచి పరిణామం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు తమిళ సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ తెలియజేశారు.