Begin typing your search above and press return to search.

ఆయన సాట‌ర్ డే బాషా ఈ మూవీలో: ఎస్.జె.సూర్య‌

థియేట‌ర్‌లో వేడుక కోసం నాని అభిమానులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు.

By:  Tupaki Desk   |   14 Aug 2024 3:53 AM GMT
ఆయన సాట‌ర్ డే బాషా ఈ మూవీలో: ఎస్.జె.సూర్య‌
X

ప‌వ‌న్‌తో 'ఖుషి' లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు ఎస్.జె.సూర్య‌. ద‌ర్శ‌క‌న‌టుడిగా అత‌డు సుప‌రిచితుడు. ఇప్పుడు నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన 'స‌రిపోదా శ‌నివారం'లో కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఆగ‌స్టు 29న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇంత‌కుముందే చిత్ర‌బృందం హైద‌రాబాద్ సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌లో ట్రైలర్ ని లాంచ్ చేసింది. థియేట‌ర్‌లో వేడుక కోసం నాని అభిమానులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు.

వేదిక‌పై మాట్లాడిన ఎస్.జె.సూర్య అభిమానుల సంద‌డి న‌డుమ మాట్లాడేందుకు కొంత ఇబ్బంది ప‌డ్డాడు. నాని ఫ్యాన్స్ హంగామా నడుమ అత‌డు మాట్లాడుతూ నాని స్వ‌యంకృషిని ప్ర‌శంసించారు. ``నాని క‌ష్ట‌ప‌డి ఎదిగిన‌ హీరో.

ఆయ‌న‌కు ఎలాంటి సినీనేప‌థ్యం లేదు. మీ అంద‌రూ(అభిమానులు) ఆయ‌న ఎదుగుద‌ల‌కు స‌హ‌క‌రించారు. ప‌రిశ్ర‌మ‌లో చాలా క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన య‌హీరో. కొత్త ప్ర‌తిభ‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. ఆయ‌న మంచి మ‌న‌సుకు త‌గ్గ‌ట్టే ఈ సినిమా విజ‌యం సాధించాలి`` అని అన్నారు.

మూవీ గురించి ఒక విష‌యం చెప్పాలి. ఆయన సాట‌ర్ డే బాషా ఈ మూవీలో.. అని నాని పాత్ర గురించి ఎస్.జె.సూర్య స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. ఎస్.జె.సూర్య మాట్లాడుతూ-``డివివి సంస్థ దాన‌య్య చాలా పెట్టుబ‌డి పెట్టారు. సోకుల పాలెం అనే విలేజ్‌ని సెట్ లో వేసారు. మూవీలో నాని పాత్ర సూర్య‌. నిజ జీవితంలో నేను సూర్య‌. నాని అభిమానుల‌ ఎన‌ర్జీ చూసాను. ఇలాంటి ఎన‌ర్జీ స‌రిపోదా శ‌నివారంలోను ఉంటుంది. థియేట‌ర్ల‌లో చూడండి. నేను ఖుషి త‌ర్వాత మ‌ళ్లీ సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌ కి రాలేదు. చాలా కాలానికి నాని సినిమా కోసం వ‌చ్చాను. నాని, ప్రియాంక ఇత‌ర న‌టులంతా బాగా న‌టించారు. నాని అభిమానుల ఎన‌ర్జీ చూసి ఏమీ మాట్లాడ‌లేక‌పోతున్నా. `స‌రిపోదా శ‌నివారం` విజ‌యానికి మీరంతా స‌హ‌క‌రించాలి అన్నారు.