SA10: సుశాంత్ బిగ్ సర్ ప్రైజ్.. ఫస్ట్ లుక్ టెర్రిఫిక్
‘SA10’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రిత్విరాజ్ చిట్టేటి దర్శకత్వం వహిస్తుండగా, వరుణ్ కుమార్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
By: Tupaki Desk | 18 March 2025 11:35 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కొంత గ్యాప్ తీసుకుని, పూర్తి కొత్త జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన 10వ సినిమాగా హారర్ థ్రిల్లర్‌ను ఎంచుకోవడం విశేషం. ‘SA10’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రిత్విరాజ్ చిట్టేటి దర్శకత్వం వహిస్తుండగా, వరుణ్ కుమార్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుశాంత్ కెరీర్‌లో పూర్తిగా విభిన్నమైన ప్రాజెక్ట్‌గా నిలిచేలా కనిపిస్తున్న ఈ మూవీ, టాలీవుడ్‌లో హారర్ థ్రిల్లర్‌లకు కొత్త ట్రెండ్ తీసుకురావాలనే టార్గెట్ తో రూపొందుతోందని అర్ధమవుతుంది.
ఇక లేటెస్ట్ గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే మేకర్స్ భారీ అంచనాలు నెలకొల్పారు. ముసురైన వాతావరణంలో, డార్క్ షేడ్స్ మధ్య నిలబడి ఉన్న సుశాంత్ లుక్ చూస్తుంటే, ఇది కేవలం సాధారణ హారర్ మూవీ కాదని, దీని వెనుక ఓ డీప్ కాన్సెప్ట్ ఉండబోతుందని స్పష్టమవుతోంది. పోస్టర్‌లో భయాందోళనకు గురైనట్టు కనిపిస్తున్న ఆయన ప్రతిబింబం కింద నీటిలో కనిపించడం, పాత్రలో అంతర్లీనంగా ఓ మిస్టీరియస్ ఎలిమెంట్ దాగి ఉందనే ఆసక్తిని పెంచింది.
దీనికి తోడు అతని ఫోకస్ ను మరింత డీప్‌గా ఎలివేట్ చేసే విధంగా బ్యాక్‌డ్రాప్ డిజైన్ చేయడం సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. ఇప్పటి వరకు రొమాంటిక్ హీరోగా ఎక్కువగా కనిపించిన సుశాంత్, ఈసారి పూర్తి ట్రాన్స్‌ఫర్మేషన్‌తో వచ్చి అలరించనున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. అతని గడ్డం లుక్, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్, డార్క్ షేడ్ క్యారెక్టర్‌ను ముందుగానే తెలియజేస్తున్నాయి.
హారర్ సినిమాల్లో విజువల్ ప్రెజెంటేషన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో దాన్ని మునుపెన్నడూ చూడని రేంజ్‌లో ఎలివేట్ చేయబోతున్నట్లు టాక్. ఇప్పటికే సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా హైలైట్ కానున్నట్లు సమాచారం. ‘SA10’ ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ట్రెండింగ్‌లో నిలిచిన ఈ పోస్టర్, సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందనే దానిపై క్లారిటీ ఇచ్చింది.
ఇప్పటి వరకు టాలీవుడ్‌లో హారర్ జానర్‌కు ఎక్కువగా లిమిటెడ్ స్పేస్ మాత్రమే ఇచ్చారు. కానీ ఈ మూవీ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో మేకింగ్‌తో ఆకట్టుకునేలా ఉందని మేకర్స్ హింట్ ఇచ్చారు. కథ నడిచే విధానం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ హై-స్టాండర్డ్‌గా ఉండేలా ప్లాన్ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దాంతో పాటు హారర్ సినిమాలను ఎక్కువగా ఆదరించే ప్రేక్షకులు దీనిపై భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. మరి నెక్స్ట్ అప్డేట్స్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.