Begin typing your search above and press return to search.

తండ్రి సినిమాల నిర్మాణంలో బిజీ బిజీగా కూతురు

ఆహాలో స్ట్రీమింగ్ అయిన సేనాప‌తి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకుంది. గ‌తేడాది శ్రీదేవి శోభ‌న బాబు పేరుతో మొద‌టిసారి థియేట‌ర్ సినిమాను నిర్మించి యావ‌రేజ్ అనిపించుకుంది.

By:  Tupaki Desk   |   12 Feb 2025 7:09 AM GMT
తండ్రి సినిమాల నిర్మాణంలో బిజీ బిజీగా కూతురు
X

కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన సుస్మిత కొణిదెల ప‌లు హిట్ సినిమాల‌కు ప‌ని చేసింది. సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ట్రై చేస్తోన్న చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొన్నేళ్ల ముందు కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా త‌న జ‌ర్నీని మొద‌లుపెట్టి చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ సినిమాల‌కు ప‌ని చేసింది.

కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా ఉన్న సుస్మిత‌ త‌ర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్టైన్మెంట్ ప్రై. లి పేరుతో బ్యాన‌ర్ ను స్టార్ట్ చేసి వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేయ‌డం మొద‌లుపెట్టింది. ఓటీటీలో మొద‌టిగా త‌న ల‌క్ ను చెక్ చేసుకున్న సుస్మిత త‌ర్వాత సేనాపతి అనే సినిమాను నిర్మించింది.

ఆహాలో స్ట్రీమింగ్ అయిన సేనాప‌తి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకుంది. గ‌తేడాది శ్రీదేవి శోభ‌న బాబు పేరుతో మొద‌టిసారి థియేట‌ర్ సినిమాను నిర్మించి యావ‌రేజ్ అనిపించుకుంది. ఇక రీసెంట్ గా ప‌రువు అనే వెబ్ సిరీస్ ను నిర్మించిన సుస్మిత ఆ సిరీస్ తో మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ద‌గ్గ‌ర నుంచి తండ్రి చిరంజీవితో సినిమా చేయాల‌ని సుస్మిత ట్రై చేస్తున్న విష‌యం తెలిసిందే.

కానీ ఆ ప్రాజెక్టు అనుకోని కార‌ణాల వ‌ల్ల లేట‌వుతూనే వ‌స్తోంది. ఇవ‌న్నీ చూసి ప్ర‌స్తుతానికైతే సుస్మిత కొన్ని ప్రాజెక్టులకు కో ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లో తన తండ్రి మెగాస్టార్ చేయ‌బోయే రెండు సినిమాల‌కు సుస్మిత స‌హ నిర్మాత‌గా ఉండ‌బోతోంద‌ట‌. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి చేయ‌బోయే సినిమాను సాహు గార‌పాటితో క‌లిపి సుస్మిత నిర్మించ‌నున్న‌ట్టు స్వ‌యంగా చిరంజీవే రీసెంట్ గా వెల్ల‌డించాడు.

దీంతో పాటూ డైరెక్ట‌ర్ బాబీ చెప్పిన ఓ క‌థ‌కు చిరూ త‌లూపాడ‌ని, మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌బోయే ఆ సినిమాలో కూడా సుస్మిత భాగం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల‌కు సంబంధించిన‌ నిర్మాణ బాధ్య‌త‌ల‌న్నీ సుస్మిత ద‌గ్గ‌రుండి చూసుకోబోతుంద‌ట‌. అంటే ఈ సినిమాల ద్వారా వ‌చ్చే లాభ న‌ష్టాల్లో కూడా సుస్మిత వాటా పంచుకోనుంద‌న్న‌మాట‌. మొత్తానికి కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టిన సుస్మిత ఇక రాబోయే రోజుల్లో నిర్మాత‌గా బిజీ అయిపోతుంద‌న్న‌మాట‌.