రామ్ చరణ్ పై అక్క ప్రేమ అద్భుతం!
నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అంతా విషెస్ తెలియజేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 March 2025 9:47 AMనేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అంతా విషెస్ తెలియజేస్తోన్న సంగతి తెలిసిందే. అర్దరాత్రి 12 తర్వాత నుంచే మోత మొదలైంది. స్టిల్ అలాగే కంటు న్యూ అవుతుంది. ఇండస్ట్రీ..ఫ్యామిలీ..ప్రెండ్స్...ఫ్యాన్స్ ఇలా అంతా విషెస్ తో హోరెత్తిస్తున్నారు. చరణ్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎన్ని ఎలా ఉన్నా రామ్ చరణ్ పై అక్క సుస్మిత ప్రేమ మాత్రం అద్భుతం అని ఒక్క పిక్ చెప్పకనే చెబుతుంది.
సుస్మిత తమ్ముడికి విషెస్ తెలియజేస్తూ తమ బాల్యానికి సంబంధించిన ఓ ఫోటో షేర్ చేసారు. అందులో సుస్మిత చరణ్‌ని ఎత్తుకుని ఉన్నారు. చరణ్ అప్పటికీ ఐదేళ్ల లోపు పిల్లవాడు. సుస్మిత ఎత్తుకుని లాలి స్తుంది. ముద్దాడుతుంది. ఓ అక్కగా తమ్ముడిపై తాను చూపించాల్సిన ప్రేమనంతటిని చూపిస్తుంది. ఆ వయసులో తమ్ముడికి సంరక్షరాలిగానూ మారిపోయింది. గ్రీన్ కలర్ గౌనులో సుస్మిత ఉండగా..టీషర్ట్ నిక్కరులో రామ్ చరణ్ ని చూడొచ్చు.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. `నా బలం..నా బ్రహ్మాస్త్రం... నా పుత్రభోశ... నా ప్రియమైన సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ పదాలు చాలా చిన్నవి. చరణ్ పై నా ప్రేమను మాటల్లో చెప్ప లేను` అని రాసుకొచ్చారు. తోబుట్టువుల బంధాన్ని తెలియజేస్తున్న గొప్ప ఫోటో ఇది. చిన్నప్పుడు అక్కా-చెల్లి, అన్నా-చెల్లి మధ్య బాండింగ్ ఎంత బలంగా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. ప్రాణ సమానంగా ఆ బంధాలు కనిపిస్తాయి.
ప్రస్తుతం సుస్మిత సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటించే సినిమాలకు చిరు ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ ఆమె డిజైన్ చేస్తారు. నిర్మాతగా కూడా ఎంట్రీ ఇస్తున్నారు. మెగాస్టార్ 157వ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ మధ్య సుస్మిత కొత్తగా వ్యాపారాల్లోనూ బిజీ అవుతున్నట్లు వినిపిస్తుంది.