Begin typing your search above and press return to search.

18 వ‌య‌సులో విశ్వ‌సుంద‌రి మెరుపులు

భారతదేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్ ఈ ఫోటోనే అని నేను గ‌ర్వంగా అన్నాను.. అని తెలిపింది.

By:  Tupaki Desk   |   14 Oct 2024 4:01 AM GMT
18 వ‌య‌సులో విశ్వ‌సుంద‌రి మెరుపులు
X

18 సంవత్సరాల వయస్సులో మిస్ యూనివ‌ర్శ్ సుస్మితా సేన్ ఎలా ఉండేది? విశ్వ సుంద‌రిగా కిరీటం గెలుచుకున్న రోజుల్లో నాటి చారిత్రాత్మక విజయాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ నోట్ రాసిన సుస్మిత కొన్ని క్లాసిక్ ఫోటోల‌ను అభిమానుల కోసం షేర్ చేసింది. ఈ నోట్ సారాంశం ఇలా ఉంది. ``ఈ ఫోటో సరిగ్గా 29 సంవత్సరాల క్రితానిది. దీనిని ఎపిక్ మ్యాన్ ఫోటోగ్రాఫర్ ప్రబుద్ధ దాస్ గుప్తా ఫ్లాష్ చేసారు. అత‌డు నా 18 ఏళ్ల వ‌య‌సును అందంగా బంధించాడు..`` అని తెలిపారు. అంతేకాదు.. నేను చిత్రీకరించిన మొదటి మిస్ యూనివర్స్ నువ్వేనని కూడా ఆయ‌న అన్నారు. భారతదేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్ ఈ ఫోటోనే అని నేను గ‌ర్వంగా అన్నాను.. అని తెలిపింది.


నా మాతృభూమి భార‌త‌దేశానికి ప్రాతినిధ్యం వహించడం గెలవడం చాలా గొప్ప గౌరవం. ఇప్ప‌టికీ ఈ గెలుపు నాకు ఆనందంతో కన్నీళ్లు తెస్తుంది… 29 సంవత్సరాల తరువాత!!! చరిత్ర సాక్షిగా, భారతదేశం మొట్టమొదటిసారిగా 21 మే 1994న మనీలా ఫిలిప్పీన్స్ లో (మహల్ కియా) మిస్ యూనివర్స్ ను గెలుచుకున్నందున నేను ఈ రోజును చాలా గర్వంగా సెల‌బ్రేట్ చేసుకుంటాను.. గుర్తుంచుకుంటాను`` అని సుష్ ఎమోష‌న‌ల్ నోట్ రాసారు. ప్రేమ- మంచితనంతో అత్యంత అందమైన సందేశాలు పంపిన‌ మీ అందరికీ ధన్యవాదాలు… ఎప్పటికీ ఆదరించండి!!! మీరంటే నాకు చాలా అభిమానం!! అని త‌న అభిమానుల‌నుద్ధేశించి సుష్ వ్యాఖ్యానించింది.

అందాల పోటీ ముగింపు వేడుక‌లో సుస్మితా సేన్ ఒక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ను ఎదుర్కొంది. అయితే తనను అడిగిన చివరి ప్రశ్న తనకు పూర్తిగా అర్థం కాలేదని సుస్మిత వెల్లడించింది. కిరీటం గెలుచుకునే ఆఖరి రౌండ్ లో సుస్మిత‌ను ``మహిళగా ఉండటంలో సారాంశం ఏమిటి?`` అని అడిగారు. దీనికి సుస్మితాసేన్ ఇలా సమాధానమిచ్చింది. ``కేవలం స్త్రీగా ఉండటం భగవంతుని వ‌రం.. మనమంతా మెచ్చుకోవాలి. పిల్లలకు మూలం ఒక తల్లి.. ఒక స్త్రీ.. ఆమె శ్రద్ధ- భాగస్వామ్యం- ప్రేమించడం అంటే ఏమిటో చూపుతుంది. అదే స్త్రీగా ఉండటంలో సారాంశం`` అని అద్భుతంగా విశ్లేషించింది. ప్ర‌స్తుతం ముంబైలో దుర్గా మాత పూజా కార్య‌క్ర‌మాల్లో జ‌యాబ‌చ్చ‌న్, కాజోల్ వంటి సీనియ‌ర్ల‌తో పాటు క‌నిపించింది సుష్‌. అక్క‌డ నిరుపేద స్ట్రీట్ కిడ్స్ తో మాట్లాడుతూ త‌న మంచి మ‌న‌సును మ‌రోసారి చాటుకుంది సుస్మితాసేన్.

కెరీర్ విష‌యానికి వ‌స్తే సుస్మిత `ఆర్య 3`లో న‌టించింది. `తాలీ` అనే చిత్రంలోను న‌టించింది. ఇందులో నటి లింగమార్పిడి కార్యకర్త గౌరీ సావంత్ పాత్రను పోషిస్తుంది. త‌దుప‌రి సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.