18 ఏళ్ల వయసులో చీవాట్లు తిన్న సుస్మితాసేన్!
`తాలీ` లాంటి సక్సెస్ పుల్ సిరీస్ తర్వాత మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ బాలీవుడ్ లో పుల్ బిజీ అవ్వడం ఖాయమనుకున్నారంతా.
By: Tupaki Desk | 23 July 2024 3:30 PM GMT`తాలీ` లాంటి సక్సెస్ పుల్ సిరీస్ తర్వాత మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ బాలీవుడ్ లో పుల్ బిజీ అవ్వడం ఖాయమనుకున్నారంతా. కానీ ఆమె కెరీర్ అలా కనిపించలేదు. తాలి హిట్ అందుకుని ఏడాది సమీపిస్తున్నా ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేసింది లేదు. అటు సినిమాలు చేయలేదు. ఇటు కొత్త సిరీస్ లకు సైన్ చేసింది లేదు. కానీ ఎఫైర్ల వార్తలతో మాత్ర నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది.
లలిత్ మోదీతో బ్రేకప్ తర్వాత మళ్లీ పాత బోయ్ ప్రెండ్ కే దగ్గరవుతుందని ప్రచారం సాగింది. ఇద్దరు జంటగా కనిపించిన సందర్భాలతో అది స్నేహమా? రిలేషన్ షిప్ నా? అన్నది మరో డౌట్ గా మారింది. అదంతా పక్కనబెడితే నేటి సమాజం తీరును..నాటి సమాజం తీరును సరిపోల్చుతూ 18 ఏళ్ల వయసులో వాడిన అసభ్య పదజాలన్ని గుర్తు చేసుకుంది సుస్మితా సేన్. ` ఆ రోజుల్లో సమాజం ఇప్పటిలా ఓపెన్ గా లేదు.
ఏం చెప్పాలన్నా సంకోచించేవారు. 18 ఏళ్ల వయసులో శోభా దేతో ఇంటర్వ్యూ సందర్భంగా ఉద్దే శపూర్వకంగానే ఓ బూతు పదం తీసుకొచ్చా. ఎందుకంటే ఓ మనిషిగా నిజమైన స్వేచ్ఛ కావాల నుకున్నాను. ఆ ప్రయత్నంలోనే భారతదేశపు మొట్ట మొదటి మిస్ యూనివర్స్ అయ్యా. కానీ ఆ పదం వాడినందుకు ఇంటికెళ్లిన తర్వాత అమ్మ-నాన్న హెచ్చరించారు. నేను వాడిన పదజాలం వాళ్లకు ఎంత మాత్రం నచ్చలేదు.
నీ భుజాలపై పెద్ద బాధ్యత ఉంది. అలాంటి బూతు పదం ఇంటర్వ్యూలో ఎందుకు మాట్లాడావు అని దండించారు. శోభా దే మీ గురించి చెడుగా రాస్తున్నారని చెప్పారు. దీంతో నేను ఆశ్చర్యపోయాను. స్వేచ్ఛ అనే విషయంలో నేను పూర్తిగా ఛాన్స్ తీసుకున్నాను అనిపించింది` అని తెలిపింది.