సంచలనం రేపిన షాబోనో బేగమ్ కేసుతో!
వివాదాస్పద అంశాలతో సినిమాలు తెరకెక్కించే సువర్ణ ఎస్. వర్మ గురించి పరిచయం అవసరం లేదు.
By: Tupaki Desk | 8 Feb 2024 12:30 AM GMTవివాదాస్పద అంశాలతో సినిమాలు తెరకెక్కించే సువర్ణ ఎస్. వర్మ గురించి పరిచయం అవసరం లేదు. వివాదాలు..విమర్శలున్న కథల్ని తెరపైకి తేడం సువర్ణ ప్రత్యేకత. ఈ విషయంలో బాలీవుడ్ మేకర్స్ నవతరం దర్శకుల్లో అతను స్పెషల్ గా నిలుస్తున్నాడు. దగ్గుబాటి రానా..వెకంటేష్ తో తెరకెక్కించి రానా నాయుడు వెబ్ సిరీస్ ని కూడా ఆయనే తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అలాగే `ది ట్రయల్` అనే వెబ్ సిరీస్ కూడా ఆయన తెరకెక్కించాడు.
తాజాగా సువర్ణ మరో వివాదస్పద అందాన్ని టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 1985 లో దేశ వ్యాప్తంగా సంచ లనం సృష్టించిన షా బానో బేగమ్ కేసు ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. భర్త నుంచి విడాకులు పొందిన షాబానో బేగమ్ కి పెద్ద మొ త్తంలో భరణం అందించాలని అత్యున్నత న్యాయ స్థానం అప్పట్లో తీర్పునిచ్చింది.
అప్పట్లో ఈ తీర్పు ఓ సంచలనంగా మారింది. ఈ తీర్పు ముస్లీం చట్టాలకు విరుద్దంగా ఉందని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దేశ వ్యాప్తంగా చాలాచోట్ల ఆందోళనలు సైతం చెలరేగాయి. దీనిపై దాదాపు 40 ఏళ్ల పాటు చర్చోపచర్చలు సాగాయి. ఈ అంశాన్ని ఇంతవరకూ ఏ మేకర్ టచ్ చేయలేదు. కొంత మంది ప్రయ త్నించినప్పటికీ సున్నితమైన అంశం కావడంతో ముందుకు కదల్లేదు.
దీంతో ఇప్పుడీ వివాదాన్ని సువర్ణ కెలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే మహిళల నుంచి ఎలాంటి విమర్శలు..వివాదం తలెత్తకుండా దర్శకుడు తగు చర్యలు ముందుగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా సాధికారిత ఆవశ్యకత తెలియజేసేలా..వారి గౌరవం రెట్టింపు చేసేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.