'సుజల్' సిరీస్ సీక్వెల్ ట్రైలర్.. ఈసారి మరింత ఇంట్రెస్టింగ్ గా..
ఇప్పటికే సీక్వెల్ పై మంచి అంచనాలు ఉండగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారి.. అందరినీ ఆకట్టుకుంటోంది.
By: Tupaki Desk | 19 Feb 2025 9:49 AM GMTకోలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుజల్ : ది వోర్టెక్స్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సిరీస్ కు సీక్వెల్ రానుంది. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ తో పాటు కదీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మ జి - అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించగా.. విక్రమ్ వేదా చిత్రం ఫేమ్ గాయత్రి, పుష్కర్ నిర్మిస్తున్నారు.
ఆర్.పార్తిబన్, హరీశ్ ఉత్తమన్, శ్రియారెడ్డి కీలకపాత్రల్లో నటించిన ఆ సిరీస్.. ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే సీక్వెల్ పై మంచి అంచనాలు ఉండగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారి.. అందరినీ ఆకట్టుకుంటోంది.
"నేను చేసింది మర్డరా లేకుంటే నా చెల్లిని హతమార్చినవాడిని చంపి తీసుకున్న రివెంజా అని నాకు అర్థం కావట్లేదు" అంటూ ఐశ్వర్య రాజేశ్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆమె ఓ క్రైమ్లో ఇరుకున్నట్లు తెలుస్తోంది. ఆమె తరఫున వాదించి విడిపించేందుకు అడ్వకేట్ చెల్లప్ప ముందుకొస్తారు.
అయితే అనుకోకుండా ఆయన మృతి చెందుతాడు. దీంతో ఆ కేసును చక్రవర్తి అనే వ్యక్తికి అప్పజెప్పుతారు పోలీసులు. అయితే ఈ కేసులో 8 మంది యంగ్ అమ్మాయిలే సస్పెక్ట్స్ అన్నట్లుగా తెలుస్తుంది. మరి చక్రవర్తి ఈ కేసును ఎలా ఛేదిస్తాడు? ఆ అమ్మాయిలు నిజంగా మర్డర్ చేశారా? అన్న అంశాలతో సిరీస్ సాగనున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా సుజల్ 2 ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. దీంతో సీక్వెల్ సీజన్ కూడా మరింత ట్విస్టులతో ఉండనున్నట్లు తెలుస్తోంది. పుష్కర్- గాయత్రి మార్క్ క్లియర్ గా కనిపిస్తోంది. తమ నరేషన్ తో మరోసారి మ్యాజిక్ చేయనున్నారని క్లియర్ గా తెలుస్తోంది. అలా సిరీస్ పై మంచి అంచనాలు పెరిగాయి.
అదే సమయంలో ట్రైలర్ కు సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉంది. తొలి సీజన్‍లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించిన ఆయన.. ఇప్పుడు అంతకు మించి అలరించనున్నట్లు తెలుస్తోంది. అబ్రహం జోసెఫ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. మరి మరో రెండు నెలల్లో స్ట్రీమింగ్ కానున్న సుజల్: ది వోర్టెక్స్ 2 సిరీస్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.. ఎంతలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.