Begin typing your search above and press return to search.

వెంకీ మహేష్ మరో సినిమా ప్లీజ్..!

ముఖ్యంగా ఇలాంటి సినిమాలు చేస్తే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ఫ్యాన్ వార్స్ వస్తాయని భయపడి తీయడం మానేశారు.

By:  Tupaki Desk   |   7 March 2025 9:30 PM
వెంకీ మహేష్ మరో సినిమా ప్లీజ్..!
X

వెండితెర మీద కొన్ని కాంబినేషన్స్ చూడముచ్చటగా ఉంటాయి. ముఖ్యంగా మల్టీస్టారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు కాలంలో మల్టీస్టారర్ సినిమాలు బాగా వచ్చాయి. ఆ తర్వాత స్టార్ హీరోల ఇమేజ్ పెరగడం సోలో సినిమాలకు డిమాండ్ ఉండటంతో ఈ మల్టీస్టారర్ సినిమాలు చేయాలన్న ఆలోచన మానుకున్నారు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు చేస్తే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ఫ్యాన్ వార్స్ వస్తాయని భయపడి తీయడం మానేశారు.

అలా అనుకుంటూ ప్రతి ఒక్కరు వెనకడుగు వేస్తున్న ఆ టైం లో మల్టీస్టారర్ సినిమా చేసి అదరగొట్టారు విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్. అది కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టూ అంటూ ఒక అందమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథతో ఆ సినిమా తీశారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన ఆ సినిమాలో కమర్షియల్ లెక్కలకు తావివ్వలేదంటే ఆశ్చర్యకరమే అని చెప్పాలి.

వెంకటేష్ పెద్దోడుగా మహేష్ చిన్నోడుగా చేసిన ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని మిగిల్చింది. ఇద్దరు స్టార్స్ తో కమర్షియల్ సినిమా చేస్తే కమర్షియల్ గా హిట్ అవుతుంది కానీ SVSC లాంటి సినిమా తీస్తే ఎప్పటికీ మిగిలిపోతుంది అని దర్శక నిర్మాతల ఆలోచన నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అందుకే ఆ సినిమా రిలీజై 12 ఏళ్లు అవుతుండగా నేడు మళ్లీ ఆ సినిమాను రీ రిలీజ్ చేశారు. క్లాస్ సినిమా అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీ రిలీజ్ థియేటర్స్ అన్నీ మహేష్ ఫ్యాన్స్ హంగామాతో కళకళలాడుతున్నాయి.

ఐతే ఈ సినిమా రీ రిలీజ్ టైం లో దిల్ రాజు కూడా SVSC సీక్వెల్ కథ ఉంటే చేయడానికి తాను రెడీ అన్నాడు. ఆడియన్స్ కూడా మరోసారి పెద్దోడు, చిన్నోడు కలిసి సినిమా చేస్తే చూడాలని కోరుతున్నారు. ఐతే ఈ కాంబినేషన్ ఇప్పుడప్పుడే సెట్ అయ్యే ఛాన్స్ లేదు కానీ అది జరిగితే మాత్రం ఫ్యాన్స్ కి పండగ అని చెప్పొచ్చు.

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమాకు డేట్స్ ఇచ్చాడు. సో 3 ఏళ్ల దాకా మహేష్ ని కదిలించడం కష్టమే.. మరోపక్క వెంకటేష్ మొన్ననే సంక్రాంతికి వస్తున్నాంతో సూపర్ హిట్ కొట్టాడు. నెక్స్ట్ సినిమా కథా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది.