Begin typing your search above and press return to search.

స్వాగ్ రేజర్ టాక్ : ముసలోడి గెటప్ లో శ్రీవిష్ణు అదుర్స్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది సామజవరగమనతో సూపర్ హిట్ కొట్టారు.

By:  Tupaki Desk   |   14 Jun 2024 7:04 AM GMT
స్వాగ్ రేజర్ టాక్ : ముసలోడి గెటప్ లో శ్రీవిష్ణు అదుర్స్
X

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది సామజవరగమనతో సూపర్ హిట్ కొట్టారు. తన కామెడీ టైమింగ్ తో అలరించారు. రీసెంట్ గా ఓం భీమ్ బుష్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. వేసవి కానుకగా విడుదలైన ఆ సినిమాలో శ్రీవిష్ణు సందడి మాములుగా లేదు. కడుపుబ్బా సినీ ప్రియులను నవ్వించారు. ఇప్పుడు స్వాగ్ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు శ్రీవిష్ణు త్వరలో వచ్చేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీవిష్ణు.. హసిత్ గోలి దర్శకత్వంలో స్వాగ్- శ్వాగణిక వంశానికి స్వాగతం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల సూపర్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్ ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేశారు. వాటిలో ముగ్గురు భామలు కూడా మహారాణుల గెటప్ లో మెరిసిపోతూ ఆకట్టుకున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ ను రేజర్ పేరుతో స్వాగ్ మేకర్స్ శుక్రవారం ఉదయం విడుదల చేశారు. 'వంశాలైనా, ఆస్తులైనా, ఆడ వాళ్ళైనా, మగవాడినే అనుసరించాలి.. భవభూతి - ది ఫేస్ ఆఫ్ ది మేల్ ప్రైడ్' అంటూ రాసుకొచ్చారు. స్వాగ్ ను చూసేందుకు సిద్ధంగా ఉండండి.. కమింగ్ సూన్ అని కూడా మెన్షన్ చేశారు. అంటే త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేజర్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక మగవాడంటే మీకేం గుర్తొస్తుందంటూ వృద్ధుడి రోల్ లో ఉన్న శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ తో రేజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత వేలెడంత పొగరు, వంశాన్ని, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వాడంటూ వచ్చిన డైలాగ్ తో శ్రీవిష్ణు ఫేస్ ను వింత నవ్వుతో రివీల్ చేశారు మేకర్స్. తాగుదామా అంటూ హుషారు పెంచాడు శ్రీవిష్ణు. తన క్యారెక్టర్ ను దివాకార్‌పేట ఎస్సై భవభూతి గా పరిచయం చేసుకున్నాడు. మొత్తానికి రేజర్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఈ సినిమాలో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు రేజర్ రిలీజ్ అయ్యాక అర్థమవుతుంది. అయితే ముసలివాడి గెటప్ లో శ్రీవిష్ణు యాక్షన్ అదరగొట్టేశారు. తన మార్క్ ను చూపించారు. వంశాలైనా, ఆస్తులైనా, ఆడ‌వాళ్లైనా మ‌గవాడినే అనుస‌రించాలంటూ పలు డైలాగులతో ఓ రేంజ్ లో అలరించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంట‌ర్టైనర్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వెయిట్ అండ్ సీ.