Begin typing your search above and press return to search.

స్వాగ్… శ్రీవిష్ణు సినిమాకు అదిరిపోయే డీల్

ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు, కర్ణాటక, తమిళనాడు థియేటర్ రైట్స్ అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది. మొత్తం 9 కోట్లకి సింగిల్ పాయింట్ లో డీల్ క్లోజ్ అయ్యిందంట.

By:  Tupaki Desk   |   24 Jun 2024 7:58 AM GMT
స్వాగ్… శ్రీవిష్ణు సినిమాకు అదిరిపోయే డీల్
X

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో శ్రీవిష్ణుకి చివరిగా సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలతో వరుసగా రెండు హిట్స్ ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అతని లైన్ అప్ లో 3-4 సినిమాల వరకు ఉన్నాయి. పెద్ద ప్రొడక్షన్ హౌస్ లలోనే శ్రీవిష్ణు మూవీస్ చేస్తూ ఉండటం విశేషం. లోబడ్జెట్ కథలకి కేరాఫ్ అడ్రెస్ గా శ్రీవిష్ణు మారిపోయాడు. ఓ 6 నుంచి 8 కోట్లు పెడితే శ్రీవిష్ణుతో మూవీ అయిపోతుంది.

తక్కువ బడ్జెట్ లో వచ్చిన అతని సినిమాలకు ఇటీవల మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. కథాబలం ఉన్న మూవీస్ చేస్తే కచ్చితంగా ప్రేక్షకాదరణ లభిస్తుందని భావిస్తున్నారు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఇప్పుడు నిర్మాతలు శ్రీవిష్ణుని చూస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ స్వాగ్. మొదట్లోనే ఈ సినిమాకు హైప్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ అడుగులు వేస్తున్నారు.

సినిమా మొదటి అప్డేట్ నుంచి ఇప్పటివరకు అందరి దృష్టిని ఆకర్షించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్ గా చేస్తోంది. ఒకప్పటి క్లాసిక్ బ్యూటీ మీరా జాస్మిన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతోంది. కథకు తగ్గట్లే ఆ పాత్రలు సినిమాలో హైలెట్ అవుతాయట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో స్వాగ్ సినిమాని హసిత్ గోలి తెరకెక్కించినట్లు టీజర్ తో స్పష్టం అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు, కర్ణాటక, తమిళనాడు థియేటర్ రైట్స్ అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది. మొత్తం 9 కోట్లకి సింగిల్ పాయింట్ లో డీల్ క్లోజ్ అయ్యిందంట. ఇటీవల కాలంలో అతని సినిమాలకు జరిగిన బిజినెస్ డీల్స్ లో ఇదే బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. ఒక విధంగా నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ తో సినిమాను విడుదల చేస్తున్నారు. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా మంచి లాభాలు వస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. వయసు మళ్ళిన వాడిగా అతని పాత్ర ఉంది.

అవుట్ అండ్ అవుట్ కామెడీ కథాంశంతో ఈ చిత్రం ఉండబోతోంది. కామిక్ స్టోరీతోనే మూవీ చేస్తోన్న ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్ ని ఈ స్వాగ్ మూవీలో చూపించబోతున్నారంట. మేల్, ఫీమేల్ డామినేషన్స్ ఎలిమెంట్స్ ని ప్రధానంగా చేసుకొని స్వాగ్ కథని దర్శకుడు చెప్పబోతున్నాడు. ఎలాగైనా స్వాగ్ మూవీ తో హ్యాట్రిక్ సక్సెస్ అందుకోవాలని శ్రీ విష్ణు భావిస్తున్నారు. హసిత్ గోలి, శ్రీ విష్ణు కాంబినేషన్ లో వస్తున్న రెండవ మూవీ స్వాగ్. మరి వారికి ఎంతవరకు సక్సెస్ అందిస్తుంది అనేది వేచి చూడాలి.