కల్కి 2 ఇప్పట్లో లేనట్లే..!
కల్కి సినిమా పార్ట్ 2 షూటింగ్ దాదాపుగా 30 శాతం పూర్తి అయిందని నిర్మాతల్లో ఒక్కరు అయిన స్వప్న దత్ అన్నారు.
By: Tupaki Desk | 25 Nov 2024 4:09 PM GMTప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కల్కి 2898 ఏడీ' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసిన కల్కి సినిమా నుంచి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్ట్ 1 లో కథను మధ్యలో వదిలేయడం జరిగింది. కనుక పార్ట్ 2 ఎలా ఉంటుంది అనే విషయమై ఆసక్తి కలగుతోంది. భారీ అంచనాల నడుమ అత్యధిక బడ్జెట్‌తో కల్కి 2898 ఏడీ పార్ట్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అది ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తాజాగా యూనిట్ సభ్యుల మాటలను బట్టి చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కల్కి సినిమా పార్ట్ 2 షూటింగ్ దాదాపుగా 30 శాతం పూర్తి అయిందని నిర్మాతల్లో ఒక్కరు అయిన స్వప్న దత్ అన్నారు. ఆమె గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. పార్ట్ 2 షూటింగ్‌ను 2025లో ప్రారంభించాలని దర్శకుడు నాగ్ అశ్విన్ భావించాడు. కానీ అది సాధ్యం అయ్యేలా లేదు. ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ, సలార్ 2, స్పిరిట్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఈ సినిమాలు అన్నీ పూర్తి అయిన తర్వాత మాత్రమే కల్కి 2 సినిమాకు డేట్లు ఇవ్వాలని ప్రభాస్ భావిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇప్పటివరకు క్లారిటీ లేనప్పటికీ కల్కి వచ్చే ఏడాది ఉండదు అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా కల్కి 2 ను రూపొందించాలని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం బిజీగా ఉండటం వల్ల ఈ గ్యాప్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ మరో సినిమాను చేస్తాడనే వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల ఆ వార్తలను కొట్టి పారేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ తాను కల్కి 2 సినిమాను చేయబోతున్నాను. ఆ సినిమా రెండు మూడు సినిమాల స్థాయిలో ఉంటుంది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తప్పకుండా కల్కి 2 తో అంచనాలు అందుకుంటామని అన్నారు.
కల్కి 2 లో మరింతగా మహాభారతం సన్నివేశాలను చూపించే అవకాశాలు ఉన్నాయి. రివీల్ కాని పాత్రలను మరింతగా చూపించడం కోసం దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి నాగ్ అశ్విన్ అంతర్జాతీయ స్థాయిలో కల్కి 2 సినిమాను తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు టార్గెట్‌గా దాదాపు రెండేళ్లు స్క్రిప్ట్ వర్క్ చేసి ఆ తర్వాత షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు. ప్రభాస్ నుంచి వస్తున్న, రాబోతున్న అన్ని సినిమాలు వెయ్యి కోట్ల టార్గెట్‌తో రాబోతున్నాయి. కనుక కల్కి సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉండాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. నాగ్ అశ్విన్ సైతం అదే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.