Begin typing your search above and press return to search.

అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డానికి నీకెంత ధైర్యం?

ల‌క్ష్మ‌ణ్ ఉట్టేక‌ర్ ఎంతో గొప్ప‌గా ఛ‌త్ర‌ప‌తి శివాజీ వార‌సుడు శంభాజీ మ‌హారాజ్ క‌థ‌ని తెర‌కెక్కించి ప్ర‌శంస‌లందుకుంటే? సినిమా పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి హాట్ టాపిక్ అయింది.

By:  Tupaki Desk   |   19 Feb 2025 9:30 PM GMT
అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డానికి నీకెంత ధైర్యం?
X

అప్పుడ‌ప్పుడు వివాదాల‌తో వార్త‌ల్లో నిల‌వ‌డం బాలీవుడ్ న‌టి స్వ‌రాభాస్క‌ర్ కు అల‌వాటైన ప‌ని. సినిమా లైనా...రాజ‌కీయాలైనా? వివిధ అంశాల‌పై త‌న‌దైన శైలిలో స్పందించి వివాదాస్ప‌దం అవుతుంటుంది. వివాదాల‌తో చెలిమి చేయ‌డం అమ్మ‌డిక బాగా అలవాటైన ప‌ని. తాజాగా 'ఛావా' చిత్రంపైనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ల‌క్ష్మ‌ణ్ ఉట్టేక‌ర్ ఎంతో గొప్ప‌గా ఛ‌త్ర‌ప‌తి శివాజీ వార‌సుడు శంభాజీ మ‌హారాజ్ క‌థ‌ని తెర‌కెక్కించి ప్ర‌శంస‌లందుకుంటే? సినిమా పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి హాట్ టాపిక్ అయింది.

ఇంత‌కీ ఆమె ఏమందంటే? మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాల‌నే దురుద్దేశంతోనే శంభాజీ మ‌హారాజ్ ను మొగ‌లు చ‌క్ర‌వ‌ర్తి ఔరంగ జేబు చిత్ర హింస‌ల‌కు గురిచేసి చంపాడని ఇందులో చూపించారు. శంభాజీ మ‌హారాజ్ ని తీవ్రంగా గాయ‌ప‌రిచి, గోళ్లు క‌త్తిరించి, క‌ళ్ల‌లో ఇనుప చ‌వ్వ‌లు దించి ఇలా చిత్ర‌హింస‌ల‌కు గురిచేసారన్న విషయాన్ని స్వ‌రాభాస్క‌ర్ త‌ప్పు బ‌ట్టింది.

దీంతో నెటి జ‌నులు ఆమె వ్యాఖ్య‌ల‌పై మండిప‌డుతున్నారు. `నువ్వు చేసిన పోస్ట్ గురించి నువ్వే ఓసారి ఆలోచించు. నేను ఢిల్లీ యూనివ‌ర్శిటీలో చ‌రిత్ర‌ను అభ్య‌సించా. ఔరంగ‌జేబు చేతిలో శంభాజీ మ‌హారాజ్ చిత్ర‌హింస‌లు అనుభ‌వించి మృతి చెందారు అన‌డంలో ఎలాంటి క‌ల్పితం లేదు. ద‌య‌చేసి చ‌రిత్ర‌తో ఆట‌లు ఆడ‌కండి అని హిత‌వు ప‌లికాడు.

శంభాజీ మ‌హ‌రాజ్ ప్రాణ‌త్యాగాన్ని త‌క్కువ చేసి మాట్లాడ‌టానికి నీకెంత ధైర్యం? అదీ శివాజీ జ‌యంతి రోజున ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నావా? అస‌లు చ‌రిత్ర గురించి నీకెం తెలుసు? అని మ‌రో నెటి జ‌నుడు మండి ప‌డ్డాడు. అంతే కాదు స్వ‌రా భాస్క‌ర్ వ్యాఖ్య‌ల‌పై తెలుగు అభిమానుల‌కు కూడా నిప్పులు చెరు గుతున్నారు. ప‌బ్లిసిటీ కోసం ఇలాంటి చిల్ల‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకో? అని హెచ్చ‌రించారు.