Begin typing your search above and press return to search.

న్యాయ మూర్తుల్నే సూటిగా ప్ర‌శ్నించిన స్వ‌రా భాస్క‌ర్!

మాలాంటి వాళ్ల‌కు కూడా న‌టించిన సినిమాలు రిలీజ్ అవ్వ‌నివ్వ‌ర‌నే భ‌యం వెంటాడుతుంది.

By:  Tupaki Desk   |   18 Sep 2024 8:30 PM GMT
న్యాయ మూర్తుల్నే  సూటిగా ప్ర‌శ్నించిన స్వ‌రా భాస్క‌ర్!
X

బాలీవుడ్ న‌టి స్వ‌రా భాస్క‌ర్ కూడా కంగ‌న ర‌నౌత్ త‌ర‌హాలో వివాదాల్లో ఆమె పేరు ఎక్కువ‌గా వినిపి స్తుంటుంది. హిందుత్వ వ్య‌తిరేకిగానూ పేరుగాంచింది. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌న‌దైన శైలిలో గ‌ళం విప్పుతుంటుంది. తాజాగా జేఎన్ యూ విద్యార్ధి ఉమ‌ర్ ఖ‌లీద్- గుజ‌రాత్ ఐపీఎస్ అధికారి సంజీవ్ భ‌ట్ వంటి వారికి మ‌ద్ద‌తుగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో అమ్మ‌డు ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

సూటిగా న్యాయ‌మూర్తుల్నే ప్ర‌శ్నించింది. 'న్యాయ వ్య‌వ‌స్థ‌ను ఓ ప్ర‌శ్న అడ‌గాల‌నుకుంటున్నా. సాధార‌ణ జ‌నాల్లో ఎన్నో భ‌యాలుంటాయి. బ్ర‌త‌కు సాగించాలి కాబ‌ట్టి వాళ్ల‌లో ఆ భ‌యం ఉంటుంది. ఎవ‌రైనా దాడి చేసి కొడ‌తారు? అన్న భ‌యం వెంటాడుతుంటుంది. దేశంలో ముస్లీంల‌ను ఎక్క‌డ‌ప‌డితే అక్కడ దాడి చేసి కొడుతున్నారు. ద‌ళితులపైనా విచ్చ‌ల‌విడిగా దాడులు జ‌రుగుతున్నాయి. మాలాంటి వాళ్ల‌కు కూడా న‌టించిన సినిమాలు రిలీజ్ అవ్వ‌నివ్వ‌ర‌నే భ‌యం వెంటాడుతుంది.

మ‌రి న్యాయ మూర్తుల‌కు మీకెందుకు భ‌యం? అధికారం మీచేతుల్లో ఉంది. ప్ర‌భుత్వాల్ని డైరెక్ట్ చేయ‌గ‌ల‌రు. 60, 70 ఏళ్ల వ‌య‌సులోనూ హైకోర్టులో..సుప్రీం కోర్టుల్లో చేరిపోతున్నారు. మీ పిల్ల‌లు కూడా పెద్ద‌వాళ్ల‌పోయి ఉంటారు. వారు పిల్ల‌లు కూడా పెళ్లిళ్లి అయిపోయి ఉంటాయి. వారి పిల్ల‌లు విదేశాల్లో ఉంటారు. ఖ‌రీదైన జీవితం. మంచి కాలేజీల్లో చ‌దువుతారు. అలా మీ కుటుంబ ప‌రంగా ఎలాంటి ఆందోళ ఉండ‌దు.

మ‌రి అలాంట‌ప్పుడు వృద్దాప్యంలో మీరెందుకు భ‌య‌ప‌డుతున్నారు? మీలో ఇంకా ఎలాంటి ఆశ‌లు మిగిలి ఉన్నాయి? రాజ్య స‌భ లో స‌భ్య‌త్వాలు? గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వుల అవ‌స‌రం ఏంటి? ఇన్ని ప‌ద‌వులు పెట్టుకున్న‌ మిమ్మ‌ల్ని మీ పని మాత్ర‌మే చేయ‌మ‌ని అడుగుతున్నాం. అది కూడా మీరు చేయ‌క‌లేక‌పోతున్నారు? ఎందుక‌ని` అంటూ న్యాయ మూర్తులపై ప్ర‌శ్న‌లు సంధించింది.