21కే విడాకులు..ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా!
తమిళ నటి స్వర్ణమాల సుపరిచితమే. మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమాలతో ఆమె పాపులర్ అయ్యారు.
By: Tupaki Desk | 17 Nov 2023 11:30 PM GMTతమిళ నటి స్వర్ణమాల సుపరిచితమే. మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమాలతో ఆమె పాపులర్ అయ్యారు. చేసింది కొన్ని సినిమాలే అయినా సహజ నటిగా ఆమెకి మంచిపేరుంది. తెలుగులో మాత్రం ఆమె సినిమాలు చేసింది లేదు. కేవలం కోలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి సాధారణ జీవితాన్ని గడుపు తున్నారు. అయితే వ్యక్తిగత జీవితంలో చాలా చేదు సంఘటలనే ఉన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చివరికి ఒత్తిడిని తట్టుకోలే ఆత్మహత్యకు సైతం సిద్దమైనట్లు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. ఇంటర్మీ డియట్ సమయంలోనే యూత్ ఇన్నేవేషన్ ఈవెంట్కి యాంకరింగ్ చేసాను. అప్పట్లో కొంత బెరుకు ఉండేది. నిజానికి ఎప్పుడు ప్రశాంతంగా..నవ్వుతూ ఉంటాను. కానీ తొలిసారి స్టేజ్ ఎక్కేసరికి భయమసింది. నాకు యుక్త వయసులోనే పెళ్లి చేసారు. 21 ఏళ్లకే విడాకులు అయ్యాయి. అప్పుడు అతనికి 25 ఏళ్లు.
ఏది తప్పు? ఏది రైట్ అన్న తెలియని వయసులో పెళ్లి..విడాకులు రెండు జరిగిపోయాయి. ఆమెరికా లైఫ్ స్టైల్ నాకు వంటపట్టకపోవడం కూడా ఓ కారణం కావొచ్చు. విడాకుల తర్వాత తల్లిదండ్రులు ఎక్కువగా బాధపడ్డారు. చదువుపై దృష్టి మళ్లిస్తే బాధని మర్చిపోతానని ఆ ప్రయత్నం చేసాను. ఇలా బ్రేకప్..కొట్లాట వల్ల మానసికంగా దెబ్బ తిన్నాను. జీవితం అంటే ఇదేనా? ఎందుకు బ్రతకాలి అనిపించింది.
చివరికి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను. నా పరిస్థితి దిగజారడం చూసి నా సోదరి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. డిప్రెషన్ నుంచి బయట పడటానికి రెండు నెలలు సమయం పట్టింది. ఆ తర్వాత సాధారణ జీవితానికి నెమ్మదిగా అలవాటు పడ్డాను` అని తెలిపారు. స్వర్ణమాలకి యాంకర్ గానూ మంచి గుర్తింపు ఉంది. సినిమాలకంటే ముందు యాంకర్ గా ఫేమస్ అయ్యారు.