Begin typing your search above and press return to search.

నిఖిల్.. ఈ ఒక్క రిస్క్ లో నెగ్గితే..

మిగిలిన 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి బడ్జెట్ 100 కోట్లు దాటిపోవచ్చని అంటున్నారు. అదే జరిగితే నిఖిల్ కెరియర్ లో స్వయంభు చాలా పెద్ద రిస్కీ ప్రాజెక్ట్ అవుతుంది.

By:  Tupaki Desk   |   13 Sep 2024 4:54 AM GMT
నిఖిల్.. ఈ ఒక్క రిస్క్ లో నెగ్గితే..
X

కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా లెవల్ లో కమర్షియల్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో నితిన్. ఈ సినిమా అతన్ని ఏకంగా స్టార్ హీరోగా మార్చేసింది. తరువాత వచ్చిన 18 పేజెస్ మూవీ డీసెంట్ హిట్ అయ్యింది. అయితే పాన్ ఇండియా ఇమేజ్ తో నిఖిల్ చేసిన స్పై మూవీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఇక ఈ సారి చేయబోయే సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో నిఖిల్ ఉన్నాడు. అందుకే ఏకంగా పీరియాడికల్ జోనర్ లో స్వయంభు మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమాలో రాజుగా నిఖిల్ నటిస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో స్వయంభు మూవీ తెరకెక్కుతోంది. మూవీలోని యుద్ధ సన్నివేశాల కోసం నిఖిల్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. దర్శకుడు భరత్ కృష్ణమాచారికి కూడా ఇదే మొదటి సినిమా. నిజానికి ఈ సినిమాని 50 కోట్ల బడ్జెట్ లో కంప్లీట్ చేయాలని అనుకున్నారంట. అయితే ప్రస్తుతం 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి 80 కోట్ల వరకు ఖర్చవుతునట్లు టాక్ వినిపిస్తోంది.

అంటే నిఖిల్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ స్వయంభు సినిమాకి ఖర్చు చేస్తున్నారు. మిగిలిన 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి బడ్జెట్ 100 కోట్లు దాటిపోవచ్చని అంటున్నారు. అదే జరిగితే నిఖిల్ కెరియర్ లో స్వయంభు చాలా పెద్ద రిస్కీ ప్రాజెక్ట్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్ లెక్కల ప్రకారం చూసుకుంటే అతనిపై 30 కోట్ల బిజినెస్ నడుస్తోంది. స్వయంభు పీరియాడికల్ కంటెంట్ కాబట్టి ఒక 50 కోట్ల వరకు బిజినెస్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అంతకు మించి డిస్టిబ్యూటర్స్ నిఖిల్ పై డిస్టిబ్యూటర్స్ రిస్క్ చేయకపోవచ్చు.

కార్తికేయ 2 చిత్రానికి సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. దైవాన్ని ముడిపెట్టి కథ చెప్పడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ సినిమా 25 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కింది. ఇక సినిమా 58 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వచ్చాయి. కార్తికేయ 2 బడ్జెట్ తో పోల్చుకుంటే స్వయంభుకి 3 రేట్లు ఎక్కువ అవుతోంది. కచ్చితంగా నిఖిల్ కెరియర్ లో ఇది హై రిస్క్ మూవీ అనే మాట వినిపిస్తోంది. 50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన మరో 50 కోట్లు నాన్ థీయాట్రికల్ ద్వారా రావాలి.

లేదంటే సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకొని సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే పెట్టుబడి మొత్తం రికవరీ అవుతుంది. లేదంటే హిట్ అయ్యి లాభాలు వచ్చిన నిర్మాతలకి పెద్దగా కలిసిరాకపోవచ్చని ట్రేడ్ పండితులు అంటున్నారు. నిఖిల్ ఈ రిస్క్ ని దాటితే ఇక అతని మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోవడం ఖాయం అని చెబుతున్నారు.