Begin typing your search above and press return to search.

స్వయంభు నిర్మాతలు ఎక్కడా తగ్గట్లేదా..?

పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 5:30 PM GMT
స్వయంభు నిర్మాతలు ఎక్కడా తగ్గట్లేదా..?
X

కార్తికేయ 2 తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న నిఖిల్ నెక్స్ట్ చేస్తున్న సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. నిఖిల్ హీరోగా ప్రస్తుతం రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు సెట్స్ మీద ఉన్నాయి. అందులో ఒకటి రాం చరణ్ నిర్మాణంలో వస్తున్న ది ఇండియా హౌస్ కాగా మరొకటి స్వయంభు. స్వయంభు సినిమాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ లో భువన్ సాగర్, శ్రీకర్ కలిసి నిర్మిస్తున్నారు. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్నారు.

కార్తికేయ 2 తో నేషనల్ లెవెల్ హిట్ అందుకోవడంతో స్వయంభు సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఐతే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయగానే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. అంతేకాదు నార్త్ సైడ్ నుంచి మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట. ఈ ఆఫర్లు చూసిన మేకర్స్ సినిమాను మరింత క్వాలిటీగా తీయాలని ఫిక్స్ అయ్యారట. నిఖిల్ స్వయంభు సినిమా మొన్నటిదాకా ఒక బడ్జెట్ లో పూర్తి చేయాలని అనుకున్నారట. కానీ సినిమాపై ఉన్న అంచనాలు చూసి మేకర్స్ ఇంకాస్త బడ్జెట్ పెట్టేస్తున్నారట.

నిఖిల్ కెరీర్ లో స్వయంభు హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రాబోతుంది. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఇంకా కథాంశం అన్ని కొత్తగా ప్రేక్షకులను ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయని అంటున్నారు. స్వయంభు సినిమా కోసం నిఖిల్ కూడా తన బెస్ట్ ఎఫర్ట్ పెట్టేస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు ఆమె కూడా మరో హైలెట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు.

సినిమాపై ఉన్న అంచనాలను అందుకునేలా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా స్వయంభుని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. స్వయంభు సినిమా కోసమే నిఖిల్ తన లుక్ ని మార్చుకున్నాడు. ఈమధ్య ఎక్కడ కనిపించినా నిఖిల్ అదే లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. సినిమా ఇప్పటివరకు సగం పూర్తి కాగా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మొత్తం పూర్తి చేసి 2025 సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేసేలా చూస్తున్నారు. నిఖిల్ స్వయంభు పెరిగిన బడ్జెట్ తో ప్రాజెక్ట్ మరింత గ్రాండియర్ గా మారబోతుందని తెలుస్తుంది. నిఖిల్ కూడా స్వయంభుతో మరో సెన్సేషన్ సృష్టించడం పక్కా అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు తెలుస్తుంది.