Begin typing your search above and press return to search.

43 వ‌య‌సులో కూతురిని డామినేట్ చేస్తున్న న‌టి

ఈడొచ్చిన కుమార్తె తొంద‌ర్లోనే న‌ట‌న‌లోకి అడుగుపెడుతోంది. ఇంకా న‌ట‌న‌లోకి రాక ముందే త‌న‌కు బోయ్స్ లో భీభ‌త్స‌మైన ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

By:  Tupaki Desk   |   8 July 2024 3:49 AM GMT
43 వ‌య‌సులో కూతురిని డామినేట్ చేస్తున్న న‌టి
X

ఈడొచ్చిన కుమార్తె తొంద‌ర్లోనే న‌ట‌న‌లోకి అడుగుపెడుతోంది. ఇంకా న‌ట‌న‌లోకి రాక ముందే త‌న‌కు బోయ్స్ లో భీభ‌త్స‌మైన ఫాలోయింగ్ ఏర్ప‌డింది. త‌న అందంతో గుండెల్ని గుల్ల చేస్తోంది. అలాంటి ఒక‌ టీనేజీ వ‌య‌సున్న కూతురు త‌న‌కు ఉన్నా 43 వ‌య‌సులో ఆమె అందానికి ప్ర‌పంచం దాసోహం అంటోంది.

ఇంత‌కీ ఎవ‌రా ప్ర‌ముఖ సెల‌బ్రిటీ అంటే? .. హిందీ బుల్లితెర న‌టి శ్వేతా తివారీ.. 43 సంవత్సరాల వయస్సులో బాగా దాచి ఉంచిన‌ మంచి వైన్ లాగా వృద్ధాప్యం అన్న‌దే లేకుండా ఎంతో అందంగా క‌నిపిస్తోంది ఈ బ్యూటీ. త‌న అద్భుత ఫోటోషూట్ల‌తో అభిమానుల హృదయాలను దోచుకుంటోంది. దీంతో ఆమె ఇద్దరు పిల్లల తల్లిలా కనిపించడం లేదనే కామెంట్లు ఎక్కువ‌య్యాయి. రెగ్యుల‌ర్ గా కుమార్తె పాలక్ తివారీతో పోల్చుతూ త‌న‌కు అక్క అవుతుందేమో! అంటూ జోక్ చేస్తున్నారు ప‌లువురు. ప్రత్యేకించి ఇన్ స్టాలో త‌న కొత్త ఫోటోషూట్ల‌ను షేర్ చేసిన‌ప్పుడు ఈ త‌ర‌హా కామెంట్లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.

శ్వేతా తివారీ అభిమానుల వ్యాఖ్య ఏమిటి? అంటే.. తన కుమార్తె కంటే చిన్నమ్మాయిలా క‌నిపిస్తోంద‌ని ఒక అభిమాని వ్యాఖ్యానించాడు. పాలక్ తివారీని తల్లి శ్వేతా తివారీతో పోల్చడంపైనా మనసు విప్పింది. అందం ప్రమాణాల విషయానికి వస్తే.. తన తల్లి శ్వేతా తివారీని త‌న‌తో నిరంతరం పోల్చడం గురించి తాను నిర్లిప్తంగా ఉన్నాన‌ని, దానికి బాధపడటం లేదని పాల‌క్ తివారీ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. పాలక్ ఇంకా మాట్లాడుతూ, తాను తన తల్లిలా అందంగా లేన‌ని చెబుతారేమోన‌ని కలవరపడ్డానని చెప్పింది. నా తల్లి అత్యంత అందగ‌త్తె. నా కంటే ఎవరూ పెద్ద అభిమాని కాదు. .. 23 ఏళ్ల పాల‌క్ ఇంకా ఇత‌ర‌ విమర్శకుల గురించి ప్ర‌స్థావిస్తూ.. తనను మంచి నటిగా గుర్తించనప్పటికీ తాను పట్టించుకోనని వెల్లడించింది. ఎందుకంటే ఈ రోజు వరకు తాను న‌ట‌న ప‌రంగా `మంచి పని` చేశానని పాలక్ నమ్మకంగా ఉంది.

శ్వేతా తివారీ గురించి మరిన్ని వివ‌రాల్లోకి వెళితే... ఏక్తా కపూర్ హిట్ టీవీ సీరియల్ -``కసౌతి జిందగీ కే``తో తనకంటూ ఒక హౌస్ హోల్డ్ నేమ్ ను సృష్టించుకుంది. రోహిత్ శెట్టి అడ్వెంచర్ స్టంట్ ఆధారిత రియాలిటీ షో `ఖత్రోన్ కే ఖిలాడి 11`లో కూడా కనిపించింది. బిగ్ బాస్ 4 విజేతగా కూడా నిలిచింది.