Begin typing your search above and press return to search.

'గాంధారి'గా తాప్సీ ప్ర‌తీకార మిష‌న్

గాంధారిగా తాప్సీ పన్ను మిష‌న్ ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. ఈ మిషన్‌లో భయంకరమైన తల్లిగా త‌ను కనిపించనుంది.

By:  Tupaki Desk   |   10 Sep 2024 10:30 AM GMT
గాంధారిగా తాప్సీ ప్ర‌తీకార మిష‌న్
X

'హ‌సీన్ దిల్‌రూబా' విజయం తర్వాత తాప్సీ పన్ను మరోసారి స్టార్ రైట‌ర్ కనికా ధిల్లాన్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ కోసం ప‌ని చేస్తోంది. తాజాగా ఈ జోడీ 'గాంధారి' అనే కొత్త చిత్రాన్ని ప్రకటించింది. యాక్షన్-థ్రిల్లర్ విభిన్నమైన ప్రేమక‌థ‌ను ఆవిష్క‌రించ‌నుంద‌ని చెబుతున్నారు. ఇది తల్లి బిడ్డల మధ్య ఉన్న గాఢమైన బంధం, శ‌త్రువుపై ప్ర‌తీకారం నేప‌థ్యంలో ర‌క్తి కట్టించ‌నుందిట‌.

కనికా ధిల్లాన్ రచించిన 'హసీన్ దిల్‌రూబా' ఫిల్మ్ ఫ్రాంచైజీలో ఇప్పుడు మ‌రోసారి మరపురాని బోల్డ్ పాత్రలో క‌నిపించేందుకు తాప్సీ మ‌రోసారి ఉత్సాహంగా బ‌రిలోకొస్తోంది. గాంధారిగా కనికరంలేని సంకల్పంతో ముంద‌డుగు వేస్తాన‌ని అంటోంది. ఇది గ్రిప్పింగ్ మిస్టరీ.. హై ఎన‌ర్జీతో కూడుకున్న రివెంజ్ డ్రామాతో ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని తెలుస్తోంది. గాంధారిగా తాప్సీ పన్ను మిష‌న్ ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. ఈ మిషన్‌లో భయంకరమైన తల్లిగా త‌ను కనిపించనుంది.

మేటి ర‌చ‌యిత కనికా ధిల్లాన్‌తో తిరిగి క‌లిసి ప‌ని చేయ‌డం గురించి మాట్లాడుతూ తాప్సీ పన్ను ఇలా అన్నారు. కనికా, నేను కలిసి ఒక చిత్రానికి పని చేయడానికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ జరుగుతుందని తాప్సీ ఆనందంగా తెలిపింది. ఇంకా ఇత‌ర‌ వివ‌రాలు వెల్ల‌డిస్తూ..''గాంధారితో మేము 9 సంవత్సరాల క్రితం చేసిన దిల్ రుబాలోని గాంభీర్యాన్ని మ‌రోసారి తెర‌పైకి తేవ‌డానికి థ్రిల్లింగ్‌గా ఉన్నాం. ఇంత‌కాలం అలాంటి ఒక మంచి పాత్ర కోసం ఎదురు చూసాను. ఒక గూఢచారి త‌ర‌హాలో ఘాఢ‌త నిండిన పాత్ర‌ కోసం ఇన్నాళ్లుగా వెతుకుతున్నాను. పగతో ర‌గిలిపోయే తల్లిగా ప్ర‌త్యేకత నిండిన‌ పాత్ర‌లో క‌నిపిస్తాను. ఇది శక్తివంతమైన కథనంతో బోల్డ్ అంశాల‌ను స్ప‌ర్శిస్తుంది'' అని తెలిపింది.

కనికా ధిల్లాన్ ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ''మా చిత్రం ఫిర్ ఆయీ హస్సీన్ దిల్‌రూబా ప్రేక్ష‌కుల నుంచి గొప్ప‌ ప్రేమ ఆద‌ర‌ణ‌ను అందుకుంది. ఆ తర్వాత తాప్సీతో గాంధారి ప్రారంభించడం సృజనాత్మకమైన హోమ్‌కమింగ్‌గా అనిపిస్తుంది. ఈ చిత్రం ఒక‌ తల్లి అచంచలమైన ప్రేమ, క్రూరత్వం అనే అంశాల‌తో ర‌క్తి క‌ట్టిస్తుంది. పులి పిల్లతో గొడవ పెట్టుకోకండి.. ఎందుకంటే ఆమె మిమ్మల్ని నాశనం చేస్తుంది! తాప్సీ - నేను మొదటిసారిగా ఒక ఆవేశపూరిత-రా-యాక్షన్ థ్రిల్లర్ కోసం కలిసి ప‌ని చేస్తున్నాం! ప్రతీకారం, విముక్తి కి సంబంధించిన‌ శక్తివంతమైన కథను తెర‌పైకి తీసుకురావాల‌ని ఉత్సాహంగా ఉన్నాం. నెట్‌ఫ్లిక్స్ సృజనాత్మక సరిహద్దులను అధిగమించడానికి ఈ కథనాన్ని దాని నిజమైన రూపంలో ప్రదర్శించడానికి మాకు స్వేచ్ఛను ఇచ్చింది. మన ప్రేక్షకులు ఈ భావోద్వేగంతో కూడిన, యాక్షన్‌తో కూడిన - థ్రిల్లింగ్‌గా సాగే గాంధారిని తెర‌పై ఆస్వాధించ‌డానికి వేచి చూస్తార‌ని భావిస్తున్నాం'' అని అన్నారు. గాంధారి విడుదల తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు.