తాప్సీ అక్కడ సొంత దుకాణం అందుకే పెట్టిందా?
సాధారణంగా హీరోయిన్లను ఎవరు ఎంపిక చేస్తారు? అంటే ఠక్కున దర్శకులని చెబుతాం.
By: Tupaki Desk | 4 Nov 2024 5:51 AM GMTసాధారణంగా హీరోయిన్లను ఎవరు ఎంపిక చేస్తారు? అంటే ఠక్కున దర్శకులని చెబుతాం. ఏ ఇండస్ట్రీలో నైనా దర్శకుడు తాను రాసుకున్న పాత్రకు ఏ హీరోయిన్ అయితే బాగుంటుందో? పూర్తి అవగాహన అతడికే ఉంటుంది కాబట్టి నచ్చిన వాళ్లను ఎంపిక చేసారు. అయితే ఎంపిక చేసేముందు హీరోని మాత్రం కొంత మంది దర్శకులు తప్పక సంప్రదిస్తారు. ఫలానా భామని తీసుకుంటున్నామని..తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నామని తమ అభిప్రాయాన్ని పంచుకుంటారు.
అవసరం మేర అప్పుడు హీరో కూడా తాను ఏదైనా సజ్జెస్ట్ చేయాలనుకుంటే చేస్తారు. అంతిమంగా హీరోయిన్ ఎంపిక అన్నది దర్శకుడిపైనే ఉంటుంది. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు ఇదే విధానం కనిపిస్తుంటుంది. కానీ బాలీవుడ్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని తాప్సీ సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్ లో హీరోయిన్లను ఎంపిక చేసేది దర్శకులు కాదు..హీరోలంటూ ఆరోపించింది. తమకు నచ్చిన వారిని వారే స్వయంగా ఎంపిక చేస్తారని అంది.
`తమ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించాలన్నది అందులో నటించే హీరోనే డిసైడ్ చేస్తాడు. కొంత మంది హీరోలు ట్రెండింగ్ లో ఉన్న వారిని తీసుకుంటారు. మరికొంత మంది తమని డామినేట్ చేయని వాళ్లను తీసు కుంటారు. హీరోయిన్ ఎంపిక అంటే అంత ఈజీ కాదక్కడ. చాలా విషయాలు పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తారు` అంది. దీంతో తాప్సీ మాటల్ని బట్టి ఎంపిక విషయంలో ఈ అమ్మడు కూడా అక్కడ ఈ రకమైన వివక్షకు గురైనట్లు కనిపిస్తుంది.
టాలీవుడ్ ని వదిలి వెళ్లిన తర్వాత అమ్మడు బాలీవుడ్ సినిమాలే చేస్తోంది. వచ్చిన అవకాశాలు కూడా సొంతం చేసుకుంటుంది. సొంతం నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. ఇందులో కొన్ని సినిమాలు కూడా నిర్మించింది. అయితే నిర్మాణ సంస్థ స్థాపన వెనుక మరో కారణం కూడా తాజాగా తాప్సీ మాటల్ని బట్టి వెలుగులోకి వస్తోంది. ఎవరూ అవకాశం ఇవ్వకపోతే తన సినిమాలో తానే నటించాలని సొంత సంస్థని స్థాపించింది అనే అంశం తె రపైకి వస్తోంది.