Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. తాప్సి ఏమందంటే?

ఒకప్పుడు సొట్ట బుగ్గల హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపించిన తాప్సి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా క్రేజ్ అందుకునే ప్రయత్నం అయితే చేస్తోంది.

By:  Tupaki Desk   |   17 July 2023 4:54 PM GMT
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. తాప్సి ఏమందంటే?
X

ఒకప్పుడు సొట్ట బుగ్గల హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపించిన తాప్సి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా క్రేజ్ అందుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. ఆ మధ్య గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేసిన అమ్మడు మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగింది. అత్యధిక స్థాయిలో పారితోషకం కూడా తీసుకుంటూ బిజీబిజీగా కనిపించింది. కానీ గత రెండేళ్ల కాలం నుంచి ఆమెకు సరైన సక్సెస్ లు అయితే రావడం లేదు.

అయినప్పటికీ కూడా విభిన్నమైన ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిజీ అవుతుంది. ఇక సౌత్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తే తప్ప ఆమె ఇటువైపు తిరిగి చూడడం లేదు. సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకునే తాప్సి రీసెంట్ గా ఒక చిట్ చాట్ లో పాల్గొని వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

ఇక పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అనే ప్రశ్నకు ఊహించిన విధంగా సమాధానం ఇచ్చింది. 'నా పెళ్లి ఎప్పుడు అవుతుందో అని చాలామంది అడుగుతున్నారు. అయితే నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు.. గర్భవతిని కాదు కాబట్టి నా పెళ్లి ఇప్పట్లో ఉండకపోవచ్చు. ఒకవేళ అలా ఏదైనా జరిగే అవకాశం ఉంటే తప్పకుండా చెబుతాను.." అంటూ తాప్సి ఊహించని విధంగా రిప్లై అయితే ఇచ్చింది.

అయితే ఆమె ఆ విధంగా రిప్లై ఇవ్వడంతో సోషల్ మీడియాలో తాప్సి ఒకరికి కౌంటర్ ఇచ్చింది అని మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే. ఇక త్వరలో డెలివరీ అవుతున్న సందర్భంలో ఆమె తన బిడ్డకు పుట్టబోయే భర్తను సోషల్ మీడియాలో రివిల్ చేసింది. అయితే ఇప్పుడు తాప్సి పెళ్లి ప్రస్తావన రాగానే.. పెళ్లి చేసుకోవడానికి నేను ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు అనే డైలాగ్ వాడడంతో ఆమె ఇలియానాకు కౌంటర్ ఇచ్చిందా? లేదంటే ఆమె మరొక విధంగా మాట్లాడిందా అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

ఇక తాప్సి అయితే గత తొమ్మిది ఏళ్లుగా ఒక బ్యాట్మెంటన్ ప్లేయర్ తో ప్రేమలో ఉంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ విషయంలో ఆమె ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం అయితే బాలీవుడ్ లోనే చాలా బిజీగా మారిపోయింది. అలాగే ఆ మధ్య ఒక తమిళ సినిమాకు కూడా గ్రీన్ సింగల్ ఇచ్చినట్లు టాక్.