అలాంటి మాటలపై తాప్సీ ప్రతీ రోజు పోరాటమే!
తాప్సీ బాలీవుడ్ కి వెళ్లిన నాటి నుంచి అక్కడే పనిచేస్తోంది. సౌత్ ఇండస్ట్రీని పూర్తిగా మర్చిపోయింది.
By: Tupaki Desk | 4 Nov 2024 12:30 AM GMTతాప్సీ బాలీవుడ్ కి వెళ్లిన నాటి నుంచి అక్కడే పనిచేస్తోంది. సౌత్ ఇండస్ట్రీని పూర్తిగా మర్చిపోయింది. కెరీర్ ని అక్కడే నిర్దేశించుకుని ప్రయాణం ముందుకు సాగిస్తుంది. నటిగా కొనసాగుతూనే సొంతంగా సినిమాలు కూడా నిర్మిస్తుంది. ఓ న్ బ్యాన్ స్థాపించి పరిమిత బడ్జెట్ సినిమాలు చేస్తోంది. అయితే అక్కడా తాప్సీ కెరీర్ టాలీవుడ్ తరహాలోనే సాగుతుంది. సరైన హిట్లు పడటం లేదు. తాప్సీ కన్నా వెనకెళ్లిన భామలు సక్సెస్ అవుతున్నారు గానీ...తాప్సీ కి మాత్రం సరైన బ్రేక్ రావడం లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పారితోషికం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `సినిమాల్లో చాలా కాలంగా కొనసాగుతున్నా. వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించాలని కోరుకుంటున్నా. పారితోషికం విషయంలో నటుల మధ్య వ్యత్యాసం ఉంటుంది అన్నది అందరికీ తెలిసిందే. `జుడ్వా-2`, `డంకీ` చిత్రాల్లో నటించినందుకు గానే నేను భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నాను అనుకుంటున్నారు.
కానీ అందులో ఎలాంటి నిజం లేదు. సినీ పరిశ్రమలో హీరోయిన్లను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూస్తారు. మా సినిమాలో పెద్ద హీరో ఉన్నాడు. వేరే వాళ్లను ఎంచుకోవాల్సిన అవసరం ఏముంది? అన్నట్లు కొంత మంది వ్యవహరిస్తారు. మరికొంత మంది మేము మంచి ప్రాజెక్ట్ ల్లో అవకాశం కల్పించి కెరీర్ కి సహాయం చేస్తున్నాం. డబ్బుదేముందని అంటారు. ఇలాంటి మాటలపై ఇండస్ట్రీ లో రోజూ పోరాటం చేస్తూనే ఉన్నా.
తమ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించాలన్నది అందులో నటించే హీరోనే డిసైడ్ చేస్తాడు. కొంత మంది హీరోలు ట్రెండింగ్ లో ఉన్న వారిని తీసుకుంటారు. మరికొంత మంది తమని డామినేట్ చేయని వాళ్లను తీసు కుంటారు` అని అంది. ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. తాప్సీ కూడా కొంత కాలంగా ఎంతో ఓపెన్ గా మాట్లాడుతుంది.