Begin typing your search above and press return to search.

ప్రీతి జింతా వార‌సురాలు సొట్ట బుగ్గ న‌వ్వులు

తాప్సీ ప‌న్ను ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సౌత్, నార్త్ ప‌రిశ్ర‌మ‌ల్లో సుదీర్ఘ కెరీర్ ని సాగించిన తాప్సీ, ఇటీవ‌ల ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాలతో న‌టిగా మంచి పేరు తెచ్చుకుంది

By:  Tupaki Desk   |   8 March 2025 3:58 AM
ప్రీతి జింతా వార‌సురాలు సొట్ట బుగ్గ న‌వ్వులు
X

తాప్సీ ప‌న్ను ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సౌత్, నార్త్ ప‌రిశ్ర‌మ‌ల్లో సుదీర్ఘ కెరీర్ ని సాగించిన తాప్సీ, ఇటీవ‌ల ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాలతో న‌టిగా మంచి పేరు తెచ్చుకుంది. మునుముందు త‌న పంథాను వీడ‌కుండా, నాయికా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోంది. ఇటీవ‌లే త‌న విదేశీ ప్రియుడు మాథియాస్ బోని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం సంసార సాగ‌రంలో స‌రిగ‌మ‌ల్ని ఆస్వాధిస్తూనే, సినిమా కెరీర్ ని చ‌క్క‌దిద్దుతోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంట‌ర్వ్యూలో తాను బాలీవుడ్ లోకి రావ‌డానికి క‌లిసొచ్చిన ఓ అంశం గురించి మాట్లాడింది. సీనియ‌ర్ బ్యూటీ ప్రీతి జింతాతో పోలిక ఉండటం వల్లే తాను బాలీవుడ్‌లోకి వచ్చానని, ప్రీతితో సమానంగా కనిపించడం వల్లే తాను ఆ అంచనాలకు తగ్గట్టుగా నటించాల్సి వచ్చిందని తాప్సీ పన్ను వెల్లడించింది.

నిజమే.. తాప్సీ న‌వ్వితే సొట్ట‌బుగ్గ‌లు క‌నిపిస్తాయి. ఆ అంద‌మైన రింగుల జుత్తు, రంగు రూపం ప‌రంగా ప్రీతి జింతాతో పోలిక‌లు ఉన్నాయి. గ్లామ‌ర్ ఎలివేష‌న్ లోను ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సారూప్య‌త‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్పుడు డ్యాషింగ్ లేడీ పాత్ర‌ల‌తో ప్రీతిని మించిపోతోంది తాప్సీ. ఇక త‌న కెరీర్ జ‌ర్నీలో ఆరంభం బొద్దుగా క‌నిపించిన తాప్సీ ఇటీవ‌ల పూర్తి జీరో సైజ్ తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. తాజాగా తాప్సీ షేర్ చేసిన ఫోటోషూట్ లో మైన‌స్ (జీరో కంటే త‌క్కువ‌)లో క‌నిపించి బిగ్ షాకిచ్చింది. ఈ ఫోటోగ్రాఫ్స్ చూశాక‌.. జీరో సైజ్‌లో బెబో క‌రీనానే కొట్టేస్తోంది! అంటూ అభిమానులు జోరుగా కామెంట్లు చేస్తున్నారు.