Begin typing your search above and press return to search.

తాప్సీ పెళ్లి.. ఎంత పెద్ద సీక్రెట్ దాచింది!

త‌న‌కు 2023లోనే పెళ్ల‌యిన విష‌యం ప్ర‌జ‌ల‌కు ఎందుకు తెలియ‌దో కూడా వెల్ల‌డించింది. నిజానికి గత ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్నాము.

By:  Tupaki Desk   |   15 Dec 2024 7:57 AM GMT
తాప్సీ పెళ్లి.. ఎంత పెద్ద సీక్రెట్ దాచింది!
X

తాప్సీ పన్ను ఇటీవల తన చిరకాల ప్రియుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. 2024 మార్చిలో ఉదయ్‌పూర్‌లో ఈ జంట వివాహం జ‌రిగింది. అయితే ఇది అస‌లు పెళ్లి కాదు.. త‌న‌కు 2023లో జ‌రిగిన‌దే అస‌లు పెళ్లి అని చెబుతోంది తాప్సీ. డిసెంబర్ 2023లో కోర్టు వివాహం(రిజిస్ట‌ర్డ్ పెళ్లి) చేసుకున్నట్లు తాప్సీ వెల్ల‌డించింది.

త‌న‌కు 2023లోనే పెళ్ల‌యిన విష‌యం ప్ర‌జ‌ల‌కు ఎందుకు తెలియ‌దో కూడా వెల్ల‌డించింది. నిజానికి గత ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్నాము. మేము అప్పుడు పేపర్‌లపై సంతకం చేసాం. నేను ఈ రోజు ప్రస్తావించకపోతే, ఎవరికీ తెలియద‌ని కూడా తాప్సీ తాజా చాటింగ్ సెష‌న్ లో అన్నారు. 2023లో పెళ్లి చేసుకునే స‌మ‌యానికి తాను కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నాన‌ని .. ఆ పెళ్లి కోసం కేవ‌లం ఒక రోజు మాత్ర‌మే స‌మ‌యాన్ని కేటాయించాన‌ని కూడా తాప్సీ వెల్ల‌డించింది. కానీ పెళ్లి త‌ర్వాత త‌న ప‌నిలోకి తిరిగి వెళ్లిపోయాన‌ని దానివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఆ సంగ‌తి తెలిసే అవ‌కాశం లేద‌ని కూడా అంది.

వ్య‌క్తిగ‌త విష‌యాలు బ‌య‌ట‌కు తెలియ‌కూడ‌ద‌ని తాను అనుకుంటాన‌ని తాప్సీ అన్నారు. వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో ముడిప‌డి వృత్తిప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని వెల్ల‌డించింది. రెండు వైపులా న‌ష్ట‌పోకూడ‌ద‌నే కొన్ని చెప్ప‌ను అని కూడా తాప్సీ అంది. రెండిటినీ సమ‌తుల్యం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని తెలిపింది. కెరీర్ లో అన‌వ‌స‌ర‌మైన ఒత్తిడి వ‌ద్ద‌ని తాము భావించిన‌ట్టు కూడా వెల్ల‌డించింది.

ఎట్ట‌కేల‌కు 2024లో కాదు.. 2023లోనే తాప్సీ పెళ్లి చేసుకుంద‌ని ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వ‌చ్చింది. అయితే అప్ప‌ట్లో తాప్సీ సీక్రెట్ మ్యారేజ్ అంటూ మీడియా కూడా కొన్ని క‌థ‌నాలు వేసింది. కానీ అవ‌న్నీ గాసిప్స్ మాత్ర‌మేన‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఇప్పుడు ఆ వార్త‌లే నిజ‌మ‌ని ప్రూవ్ అయింది.

తాప్సీ పన్ను- మథియాస్ బో మార్చి 23న ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. హాజరైన కొద్దిమంది ప్రముఖులలో అనురాగ్ కశ్యప్, పావైల్ గులాటి, ర‌చ‌యిత కనికా ధిల్లాన్ తదితరులు ఉన్నారు. తాప్సీ పన్ను చివరిగా ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబాలో కనిపించింది. సన్నీ కౌశల్ , విక్రాంత్ మాస్సేతో కలిసి నటించింది.