ముసలోడినంటూ తాప్సీ భర్త నిరుత్సాహం!
ఇప్పటికే కొన్ని దేశాలు ముందజలో ఉండగా..ఆయా దేశాలు కోచ్ ల పేర్లు అంతే ఆసక్తికరంగా మారాయి.
By: Tupaki Desk | 3 Aug 2024 2:35 PM GMTప్రపంచమంతా ఒలిపింక్స్ వేవ్ లో ఉందిప్పుడు. అన్ని దేశాలు పసిడి పతకాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు ముందజలో ఉండగా..ఆయా దేశాలు కోచ్ ల పేర్లు అంతే ఆసక్తికరంగా మారాయి. మరి తాప్సీ భర్త బ్యాడ్మింటన్ కోచ్ మతియాస్ బో పరిస్థితి ఏంటి? అంటే సరిగ్గా ఇదే సమయంలో మథియాస్ రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చారు.
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సాత్విక్ సాయిరామ్- చిరాగ్ శెట్టి కోచ్ గా మథియాస్ వ్యవహరిస్తున్నారు. ప్యారిస్ ఒలిపింక్స్ లో వీరిద్దరు మథియాస్ ఆద్వర్యంలోనే పాల్గొన్నారు. వరుస విజయాలతో క్వార్టర్స్ వరకూ చేరినా ఈ జోడీ మలేషియా ద్వయం ముందు తలవంచారు. దీంతో మథియాస్ రిటైర్మెంట్ ప్రకటించారు. కొంత కాలంగా వీరిద్దరు మథియాస్ అండర్ లోనే ఉన్నారు.
ఉత్తమ ఆటగాళ్లగా ఎదిగారు. దీంతో 2024 ఒలిపింక్స్ లో పతకం తేవడం ఖాయమనుకున్నారు. కానీ మరోసారి నిరాశ తప్పలేదు. ఈ క్రమంలో మథియాస్ రిటైర్మెంట్ తో షాక్ ఇచ్చారు. `ప్రతీ మ్యాచ్ ని మనసు పెట్టి ఆడారు. నన్ను గర్వపడేలా చేసారంటూ` మథియస్ స్పందించారు. భారత్ లో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయంటూ గుర్తు చేసుకున్నారు.
`కోచ్ గా నా ప్రయాణం ముగిసింది. కోచ్ గా ఇంకెక్కడా కొనసాగలేను. ఇప్పటికే బ్యాడ్మింటన్ కోసం చాలా సమయం కేటాయించాను. కోచ్ గా ఉంటే తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేనేమో అలసి పోయిన ముసలి వ్యక్తిని. ఊహించిన ఫలితాలు రాకపోతే నిరాశ చెందుతాం. మీరంతా కష్టపడే తత్వం ఉన్నవారు. పతకంతో ఇండియాకి తిరిగి వెళ్లాలని ఎంతో శ్రమించారు. కానీ కొన్నిసార్లు మన అంచనాలు తప్పుతాయి. అయనా నిరాశ చెందాల్సిన పనిలేదు. మరో రోజు మనకంటూ ఉంటుంది` అని యువతలో ఉత్సాహం నింపారు.