అందమైన బ్లాక్ తాప్సి చెక్‌మేట్...!
హిందీ పరిశ్రమలో మొదట్లో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో మాత్రమే చేసింది.
By: Tupaki Desk | 16 Aug 2024 12:30 PM GMTఝుమ్మంది నాదం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తాప్సి టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది హీరోలతో నటించి మెప్పించింది. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో ఎక్కువ కాలం టాలీవుడ్ లో పెద్ద సినిమాల్లో ఆఫర్లు రాలేదు. టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గుతున్న సమయంలో బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసింది. అక్కడ తాప్సి పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. చిన్న సినిమాల హీరోయిన్ నుంచి ఇప్పుడు పెద్ద స్టార్ హీరోల సినిమాల వరకు ఆమె ఎదిగింది. హిందీ పరిశ్రమలో మొదట్లో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో మాత్రమే చేసింది.
లేడీ ఓరియంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా మారిన తాప్సి సోషల్ మీడియా సెన్షేషన్ అన్నట్లుగా ఫోటోలు షేర్ చేస్తుంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి స్టైల్ ను మెయింటెన్ చేయడం ద్వారా రెగ్యులర్ గా వార్తల్లో నిలవడమే కాకుండా, తాను షేర్ చేసిన ఫోటోలతో వైరల్ అవుతూ ఉంది. తాజాగా ఈ అమ్మడు ఇలా బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ తో సందడి చేసింది. ఈ ఫోటోలను షేర్ చేసిన తాప్సి ఇన్ స్టా లో చెక్‌మేట్ అంటూ కామెంట్ పెట్టి కుర్రాళ్లకు తన బ్లాక్ అందంతో చెక్ పెట్టింది అనడంలో సందేహం లేదు.
ఇటీవల తాప్సి హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రెగ్యులర్ గా సందడి చేస్తూనే ఉంది. ఈ స్థాయిలో కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవ్వడం చాలా తక్కువ మంది హీరోయిన్స్ నే చూస్తూ ఉంటాం. తాప్సి ఆ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా తాప్సి మరింత అందంగా కనిపించడం మాత్రమే కాకుండా చూపు తిప్పుకోనివ్వనంత అందం అంటూ నలుగురితో అనిపించుకుంటుంది. ఇంత అందం వల్లే బాలీవుడ్ ప్రేక్షకులు ఈ అమ్మడికి నీరాజనాలు పలుకుతున్నారు.
ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే 2022 లో ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాప్సి గత ఏడాది రెండు సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ ఏడాది ఇప్పటికే ఈమె నటించిన ఫిర్ ఆయీ హసీనా దిల్‌రూబా, ఖేల్ ఖేల్ మేనా సినిమాలతో సందడి చేసింది. మరో వైపు రెండు మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ ఏడాది మరో సినిమా తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి తాప్సి బాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా, అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది.