తాప్సి పారిస్ పరువం చీరలో నెవ్వర్ బిఫోర్
గత ఏడాది షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
By: Tupaki Desk | 3 Aug 2024 4:19 AM GMTఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తాప్సి తరువాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ యాక్టర్ గా వరుస సినిమాలు చేస్తోంది. ఫీమేల్ సెంట్రిక్ కథలకి తాప్సి కేరాఫ్ అడ్రెస్ గా ఉంటుంది. బయోపిక్ లు కూడా ఎక్కువగా చేస్తోంది. మిథాలీ రాజ్ బయోపిక్ లో ఆమె నటించింది. గత ఏడాది షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ మూవీ పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.
ఆగష్టులో తాప్సి నుంచి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. హసీనా దిల్ రుబాకి సీక్వెల్ గా తెరకెక్కిన ప్యార్ అవి హసీనా దిల్ రుబా మూవీ ఆగష్టు 9న థియేటర్స్ లోకి వస్తోంది. విక్రాంత్ మెస్సీ ఈ సినిమాలో తాప్సికి జోడీగా నటిస్తున్నాడు. ఆగష్టు 15న ఖేల్ ఖేల్ మెయిన్ అనే మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ మూవీ కథ పారిస్ నేపథ్యంలో ఉండబోతోంది. హాలీవుడ్ మూవీ పెర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.
అక్షయ్ కుమార్, తాప్సి, వాణి కపూర్ లాంటి స్టార్ యాక్టర్స్ ఈ చిత్రంలో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా తాప్సి ఇన్ స్టాగ్రామ్ లో పారిస్ లో దిగిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. బ్లాక్ శారీలో ఈ అమ్మడు హోటల్ లో దిగిన పిక్ ని పంచుకుంది. అలాగే పారిస్ రోడ్లు మీద హ్యాపీ రిఫ్రెష్ అవుతూ ఉన్న ఫోటోలు, వీడియోస్ ని పంచుకుంది. వీటిని షేర్ చేయడంతో పాటు ఖేల్ ఖేల్ మెయిన్ మూవీ ట్రైలర్ కి పబ్లిక్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని పోస్ట్ పెట్టింది.
ఇంత మంచి రెస్పాన్స్ అందించిన ప్రేక్షకులకి థాంక్స్ తెలియజేసింది. పారిస్ లో ఈ సినిమా చాలా అందంగా, లవ్ లీగా తెరకెక్కిందని పేర్కొంది. అలాగే ప్రేమ, కామెడీ కలగలిసి మూవీ ఉంటుందని మెన్షన్ చేసింది. నేను కట్టుకున్న చీర ఏదో చెబుతోంది అంటూ ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. తాప్సి షేర్ చేసిన ఫోటోలకి నెటిజన్లు నుంచి ఇంటరెస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయి.
వారం రోజుల గ్యాప్ లో తాప్సి నుంచి ఈ నెలలో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆగష్టు 1న తాప్సి బర్త్ డే కావడం ఆమె తన పుట్టినరోజు వేడుకల్ని పారిస్ లో చేసుకున్నట్లు ఈ ఫోటోల బట్టి తెలుస్తోంది. నెటిజన్లు ఆమెకి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.