తాప్సీ భాజాలకు ముహూర్తం సెట్!
ఇటీవలే వరుణ్ -లావణ్య త్రిపాఠి....రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ వివాహ బంధంతో ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 Feb 2024 2:30 PM GMTపెళ్లిళ్లకు ఇదే మంచి సీజన్. ఇంతకు మించి దాటి ఎండలు ముదిరిపోతాయి. ఆలస్యం అమృతం విషం కూడా. అందుకే ఎంత వీలైతే అంత తొందరగా వివాహ క్రతవును కానిచ్చేయాలని అందరూ చూస్తున్నారు. ఈ విషయంలో సెలబ్రిటీలు కూడా ఏం తగ్గలేదు. ఇటీవలే వరుణ్ -లావణ్య త్రిపాఠి....రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ వివాహ బంధంతో ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా తాప్సీ కూడా భాజాలు మ్రోగించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అమ్మడు కొన్నాళ్లగా మథియాస్ బోనుతో ప్రేమలో మునిగి తేలుతోన్న సంగత తెలిసిందే. ఇంతకాలం బోయ్ ప్రెండ్ విషయంలో అంతా గోప్యంగా ఉంచినా ఇప్పుడంతా పబ్లిక్ అవ్వడంతో పెళ్లి ఎప్పుడు? అని ఒత్తిడి మొదలైంది. దీంతో తాప్సీ కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. మార్చిలో ఇద్దరు వివాహం చేసుకోబొతున్నట్లు ప్రచారం సాగుతుంది.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వివాహ వేదికగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. వివాహం సిక్కు - క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరగనుందని తెలిసింది. అంతకు ముందు జరగాల్సిన నిశ్చితార్ద కార్యక్రమం మాత్రం ముంబైలో నిర్వహించాలని కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారుట. దీనికి సంబంధించి అధి కారిక ప్రకటన తాప్సీ నుంచి త్వరలోనే వెలువడుతుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి.
మథియాస్ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇప్పుడు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 1998లో అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించాడు. డబుల్స్ లో ఆయన నెంబర్ 1 ర్యాంకును సాధించాడు. ప్రస్తుతం ఇండియా డబుల్స్ టీమ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 2012 ఒలింపిక్స్ లో డబుల్స్ లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. 2013 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించాడు. 2013లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సమయంలో తాప్సీ- మథియాస్ రిలేషన్ ప్రారంభమయింది.