Begin typing your search above and press return to search.

పెళ్లి వార్త‌ల‌పై తాప్సీ ప‌న్ను క్లారిటీ ఇదిగో

తన కుటుంబంతో ఉన్న ఫోటోల‌ను కూడా తాప్సీ షేర్ చేస్తోంది. త‌న‌ సోదరి స్నేహితులతో సరదా పర్యటనల ఫోటోల‌ను షేర్ చేసింది

By:  Tupaki Desk   |   29 Feb 2024 4:09 AM GMT
పెళ్లి వార్త‌ల‌పై తాప్సీ ప‌న్ను క్లారిటీ ఇదిగో
X

తాప్సీ పన్ను పెళ్లి గురించి గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న చిరకాల ప్రియుడు మథియాస్ బోని తాప్సీ ఈ ఏడాది మార్చి చివరిలో ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోనున్నారనే ప్రచారం బలంగా ఉంది. దీనిపై తాప్సీ ఇప్పుడు స్పందించింది. వివ‌రాల్లోకి వెళితే...

దాదాపు దశాబ్ద కాలంగా డేటింగ్ లో ఉన్న‌ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ఈ ఏడాది మార్చి చివరి నాటికి తన బాయ్‌ఫ్రెండ్ మథియాస్ బోని వివాహం చేసుకోబోతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వార్తలపై స్పందించ‌ని తాప్సీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. ఇటీవ‌ల తాప్సీ తన సినిమాలు, ఇత‌ర‌ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లను మాత్ర‌మే సోషల్ మీడియాలో చురుగ్గా షేర్ చేస్తోంది.

తన కుటుంబంతో ఉన్న ఫోటోల‌ను కూడా తాప్సీ షేర్ చేస్తోంది. త‌న‌ సోదరి స్నేహితులతో సరదా పర్యటనల ఫోటోల‌ను షేర్ చేసింది. కానీ తన ల‌వ్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి క్లూ ఇవ్వ‌డం లేదు. తన ప్రియుడు మథియాస్ బోతో తనకున్న సంబంధం గురించి ఏరోజూ వివ‌రాలు వెల్ల‌డించ‌డం లేదు. అయినా తాప్సీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడంతో ఆమె ఎట్టకేలకు మౌనం వీడింది.

జాతీయ మీడియా క‌థ‌నం ప్రకారం తన ప్రియుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను వివాహం చేసుకోవడానికి తాప్సీ సిద్ధంగా ఉంది. ఉదయపూర్‌లో మార్చి చివరిలో వివాహ వేడుకలు జరుగుతాయి. రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ జంట మాదిరి కాకుండా.. తాప్సీ - మథియాస్ తమ సన్నిహిత కుటుంబం స్నేహితుల స‌మ‌క్షంలో మాత్రమే తమ వివాహ‌ వేడుకను నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇది సిక్కు, క్రిస్టియన్ విధానాల‌లో సాగే పెళ్లి అంటూ ప్ర‌చారం సాగింది.

కానీ దీనిని తాప్సీ ఖండించింది. ప్ర‌ముఖ జాతీయ మీడియా తాప్సీని నేరుగా పెళ్లి గురించి ప్ర‌శ్నించింది. దీనికి స్పందిస్తూ..తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తాప్సీ ప‌న్ను చెప్పింది. నేను ఎప్పటికీ అలా చేయను! అని తాప్సీ చెప్పినట్లు పేర్కొంది.

మథియాస్ బోతో తన ప్రేమ వ్యవహారం గురించి తాప్సీ గ‌తంలోను పెద్దగా వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. కేవ‌లం మాథియాస్ తో క‌లిసి ఉన్న అంద‌మైన ఫోటోని పోస్ట్ చేయడం ద్వారా త‌న డేటింగ్ ని తాప్సీ అధికారికంగా వెల్ల‌డించింది. ఇంత‌కుముందు తాప్సీ పుట్టినరోజు సందర్భంగా బో త‌న‌ కోసం ఒక నోట్‌ను కూడా రాశాడు. కొన్నిసార్లు నా కుంటి జోకులను చూసి నవ్వని వ్యక్తిని కనుగొన్నందుకు నేను ఎంత అదృష్టవంతుడిని... నువ్వు నవ్వుతూ ఉండేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను (రెడ్ హార్ట్ ఎమోజి) అంటూ త‌న ప్రేమ‌ను కురిపించాడు మాథియాస్.