పార్టీకి వెళితేనే పెద్ద హీరోలు శిబిరంలో చోటిస్తారు: తాప్సీ
ముక్కు సూటిగా పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాల గురించి పూస గుచ్చుతోంది తాప్సీ పన్ను
By: Tupaki Desk | 13 March 2024 2:30 AM GMTముక్కు సూటిగా పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాల గురించి పూస గుచ్చుతోంది తాప్సీ పన్ను. ఇంతకుముందు టాలీవుడ్ లో ప్రవేశిస్తున్నప్పుడు ప్రముఖ దర్శకుడితో తన అనుభవాల గురించి బహిరంగంగా చర్చించి వివాదాల్లోకి వచ్చింది. ఇప్పుడు తాప్సీ పన్ను బాలీవుడ్‌లో తన ప్రారంభ రోజుల అనుభవాల గురించి ఓపెనైంది. తాను ఇతరుల సలహాలను విస్మరించి విజయానికి కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నాని కూడా తాప్సీ అంది. ఇటీవల జామ్‌నగర్‌లో జరిగిన అంబానీ పార్టీలో కనిపించకపోవడానికి కారణమేమిటో ప్రశ్నించగా తాప్సీ చాలా విషయాలు చెప్పింది.
తాప్సీ మాట్లాడుతూ..పెద్దలకు మెసేజ్‌లు పంపాలని నాకు చెప్పేవారని... అలా చేస్తే వారు నన్ను వారి పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానిస్తారని తెలిపారు. నేను ఆ తరహా కాదు కాబట్టి అలా చేయలేను. నేను కూడా ఉదయం త్వరగా లేస్తాను కాబట్టి రాత్రి 10 గంటల తర్వాత మేల్కొనలేను. నేను తాగను.. పొగ కూడా తాగను కాబట్టి అక్కడ ఏం చేయాలో నాకు తెలియదు. నేను నా స్నేహితులతో పార్టీ చేసుకుంటాను. అక్కడ నేను డ్యాన్స్ లు చేస్తాను.. బాగా తింటాను. నాకు బాగా తెలియని వ్యక్తులతో పార్టీ చేసుకోలేను. నేను రానని ఇండస్ట్రీ ప్రజలకు తెలుసు కాబట్టి నన్ను పిలవరు. అయితే నేను పార్టీకి రాకపోతే నాకు ఏ పని రాదని దీని అర్థం కాదు`` అని అంది.
పార్టీలలో కనిపించడం అంటే బాలీవుడ్ క్యాంప్‌లకు యాక్సెస్ అని కూడా తాప్సీ అంగీకరించింది. శిబిరాల్లోకి ప్రవేశించడానికి ఇది కూడా ఒక మార్గం. కానీ రాత్రి 10 గంటల తర్వాత పార్టీ చేసుకునే ప్రక్రియ నాకు తెలీదు. అందుకే నేను కష్టతరమైన మార్గాన్ని ఎంచుకుంటాను.. చాలా పని చేస్తాను. చెడు పని చేసే స్వేచ్ఛ నాకు లేదు.. ఎందుకంటే దాంతో చాలా ఖర్చు అవుతుంది.. నాకు క్యాంపులకు ప్రాప్యత లేదు.. అని అంది.
ఇదే ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. తన సమకాలీనులు తనకు స్ఫూర్తినిచ్చారని తాప్సీ చెప్పింది. ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ ఎంపికలను చూసి తాను విస్మయానికి గురవుతున్నానని చెప్పింది. దీపికా పదుకొణెని చూడండి.. ఎంత సొగసైన పనిని అందుకుందో.. అలియా భట్ కోసం ఒక పళ్ళెంలో అన్నిటినీ అందిస్తున్నారు. తను అవకాశాలను ఎక్కువగా ఉపయోగించుకుంటుంది... అని పొగిడేసింది తాప్సీ.
నటీమణులు ఎంచుకునే పాత్రల ఆధారంగా `బింబోస్` అని ఎలా ట్యాగ్ చేస్తారో కూడా తాప్సీ చెప్పింది. ఈ రోజు జీవించి ఉన్న ఏ నటి కూడా బింబో కాదు. వారు ఖచ్చితంగా బింబోస్ కాదు. వారు పోషించే పాత్రల ద్వారా వారిని అంచనా వేయకండి. వారికి వారి స్వంత కారణాలు ఉన్నాయి. వారంతా నిజంగా తెలివైనవారు.. మిమ్మల్ని మానసికంగా ప్రేరేపించగల వారు పరిశ్రమలో ఉన్నారు.. అని తాప్సీ అంది.