Begin typing your search above and press return to search.

తాప్సీ పంచ్ అంబానీ ఇంట పెళ్లిపైనేనా?

కింగ్ నాగార్జున గ‌తంలో మాట్లాడిన ఓ పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట మ‌ళ్లీ వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తె లిసిందే

By:  Tupaki Desk   |   15 July 2024 6:53 AM GMT
తాప్సీ పంచ్ అంబానీ ఇంట పెళ్లిపైనేనా?
X

కింగ్ నాగార్జున గ‌తంలో మాట్లాడిన ఓ పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట మ‌ళ్లీ వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తె లిసిందే. `పెళ్లిళ్ల‌కు డ‌బ్బులిచ్చి తీసుకొస్తుంటే ఇంకే చెబుతామండి? మా పెళ్లిళ్ల‌కు రండి మేం డ‌బ్బులిస్తాం అంటున్నారు. మరి అలాంటి పెళ్లికి మీరు ఎప్పుడైనా వెళ్లారా? అంటే వెళ్ల‌లేదు. కానీ ఆఫ‌ర్ వ‌చ్చింది. గెస్ట్ గా వ‌చ్చి 20 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలు... కానీ నేను ఇలాంటి వాటిని ఎంట‌ర్ టైన్ చేయ‌ను. హిందీ స్టార్ల‌కు అయితే కోటి రూపాయ‌ల‌కు వ‌ర‌కూ ఇచ్చారంటండి అన్నారు.

మ‌న‌వాళ్ల‌కి అంత ఇవ్వ‌క‌పోయినా...క‌చ్చితంగా ఎంతో కొంత ఉంటుంది? అన్న‌ట్లు వ్యాఖ్యానించారు కింగ్ స‌రిగ్గా అంబానీ ఇంట పెళ్లి వేడుక‌లు ముగిస‌న అనంత‌రం ఈ పాత వీడియో వైర‌ల్ అవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో నాగ్ ఎవ‌ర్ని దృష్టిలో పెట్టుకుని అలా మాట్లాడిన‌ట్లు? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. ఆ సంగ‌తి పక్క‌న‌బెడితే తాజాగా తాప్సీ కూడా అనంత్ అంబానీ-రాధికా మ‌ర్చంట్ వివాహానికి హాజ‌రు కాక‌పోవ‌డంపై స్పందించింది.

`నిజం చెప్పాలంటే వాళ్లు నాకు వ్య‌క్తిగతంగా తెలియ‌దు. పెళ్లి అనేది అనుబంధాల‌తో కూడుకున్న‌ది. ఆతిధ్యం ఇచ్చే కుటుంబానికి- అతిధి మ‌ధ్య క‌నీసం ఏదో ఒకర‌క‌మైన అనుబంధం ఉండాలని నేను భావిస్తాను. అలాంటి వివాహాలకు మాత్ర‌మే హాజ‌ర‌వుతాను` అని అంది. అంటే అంబానీ ఇంట నుంచి పిలుపొచ్చినా కేవ‌లం త‌న‌ని ఓ స్టార్ గా మాత్ర‌మే ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది.

ఆ కుటుంబంతో గానీ, ఆ ఫ్యామిలీ వ్య‌క్తుల‌తో గానీ ఎలాంటి ప్రెండ్ షిప్ గానీ, క‌నీసం ప‌రిచ‌యం గానీ లేన‌ట్లుంది. అందుకే తాప్సీ పెళ్లికి వెళ్ల‌లేదు. అంతేగా ఏ వేడుక‌కు వెళ్లాల‌న్నా ఆ ఫ్యామిలీ వ్య‌క్తిగ‌తంగా తెలిసి వెళ్తే అందంగా ఉంటుంది. పిలిచార‌ని వెళ్లిపోతే అది మ‌రోలా ఉంటుంది. అంబానీ ఇంట పెళ్లి కోసం చాలా మంది స్టార్లు హాజరైన సంగ‌తి తెలిసిందే.