Begin typing your search above and press return to search.

ఆమెకి నేను న్యూ వర్షన్‌... అందుకే బిజీ బిజీ

అందుకే బాలీవుడ్‌ వైపు ఈ అమ్మడు అడుగులు వేసింది. అక్కడ చేసిన సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌ గా మారింది.

By:  Tupaki Desk   |   18 Jun 2024 1:15 PM GMT
ఆమెకి నేను న్యూ వర్షన్‌... అందుకే బిజీ బిజీ
X

సౌత్ సినిమాలతో ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ తాప్సి. తెలుగు లో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించిన కూడా రావాల్సిన గుర్తింపు, దక్కాల్సిన స్టార్‌ డం దక్కలేదని చెప్పాలి. అందుకే బాలీవుడ్‌ వైపు ఈ అమ్మడు అడుగులు వేసింది. అక్కడ చేసిన సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌ గా మారింది.

హిందీలో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు అనగానే చాలా మంది తాప్సి వైపు చూస్తున్నారు. అంతగా బిజీ అయిన ముద్దుగుమ్మ తాప్సీ ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్‌ సాగిన తీరు గురించి సదరు ఇంటర్వ్యూలో తాప్సి చెప్పుకొచ్చింది.

తాప్సి మాట్లాడుతూ... చాలా మంది నన్ను బాలీవుడ్‌ స్టార్‌ నటి ప్రీతీ జింటా కి న్యూ వర్షన్ అన్నట్లుగా మాట్లాడుకుంటారు. ముఖ్యంగా బాలీవుడ్‌ లో మొదటి సినిమా చేసిన సమయంలో చాలా మంది అలాంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు, నన్ను అలాగే చూసేవారు. అందుకే ఆ సమయంలో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

బాలీవుడ్‌ లో ఈ మధ్య కాలంలో ప్రీతీ జింటా ఎక్కువగా సందడి చేయడం లేదు. అందుకే ఆమె స్థానంను తాప్సి కి ఇచ్చే విధంగా న్యూ వర్షన్ ఆఫ్‌ ప్రీతీ జింటా అంటూ ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ లో బిజీగా ఉన్న ఈ అమ్మడు ముందు ముందు మరింతగా సందడి చేసే అవకాశాలు ఉన్నాయి.

తాప్సి కి కెరీర్‌ ఆరంభంలో సౌత్‌ లో ముఖ్యంగా తెలుగు లో ఆఫర్లు వచ్చాయి. కనుక బాలీవడ్‌ లో బిజీగా ఉన్నా కూడా సౌత్‌ సినిమాల్లో నటించాలని కోరుకుంటుంది. ముఖ్యంగా తెలుగు సినిమాలకు తాప్సి ఎప్పుడు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు అంటూ ఉంటారు.