Begin typing your search above and press return to search.

సిస్ట‌ర్‌తో క‌లిసి తాప్సీ కొంటె ప‌నులు చూశారా?

పెళ్లి తర్వాత తాప్సీ ఆమ్‌స్టర్‌డామ్‌కి వెకేషన్‌కు వెళ్లింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు దీనికి ప్రూఫ్ గా మారాయి

By:  Tupaki Desk   |   6 May 2024 4:00 AM GMT
సిస్ట‌ర్‌తో క‌లిసి తాప్సీ కొంటె ప‌నులు చూశారా?
X

తాప్సీ పన్ను ఇటీవ‌ల కొంత‌కాలంగా రెగ్యుల‌ర్ గా మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. తన చిరకాల ప్రియుడు మథియాస్ బోని ఒక సింపుల్ వేడుకలో వివాహం చేసుకున్నప్పటి నుండి వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ సీక్రెట్ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి తర్వాత తాప్సీ ఆమ్‌స్టర్‌డామ్‌కి వెకేషన్‌కు వెళ్లింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు దీనికి ప్రూఫ్ గా మారాయి.

తన ఇన్‌స్టాగ్రామ్ లో తాప్సీ ఈ ఫోటోలను షేర్ చేసింది. క్యాప్ష‌న్ లో ఇలా వ్యాఖ్యానించింది. ``నాకు న‌చ్చే ఆమ్‌స్టర్‌డామ్... కెనాల్, సైక్లింగ్.. తోబుట్టువులు...`` అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ ఫోటోలలో తాప్సీ నలుపు రంగు మిశ్ర‌మంతో కూడిన వైట్ కలర్ లాంగ్ జాకెట్‌ని ధ‌రించి క‌నిపించింది. తాప్సీ సోదరి షాగౌన్ పన్ను కూడా వైట్ కలర్ స్వెట్ ష‌ర్ట్ ధరించింది. అయితే ఈ వెకేష‌న్ లో తాప్సీ భ‌ర్త మాథియాస్ క‌నిపించ‌లేదు.

లవ్‌బర్డ్స్ విడివిడిగా ఉన్నారని దీనిని బ‌ట్టి అర్థ‌మైంది. తాప్సీ సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వెకేష‌న్ కి హాజరయ్యారు. ఈ జంట ఇంకా పెళ్లికి సంబంధించిన కీల‌క ఫోటోల‌ను షేర్ చేయ‌నే లేదు. వారి వెడ్డింగ్ ప్లానర్ ఇటీవలే సంగీత్ వేడుక కు సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేయ‌గా అది వెబ్ లో వైర‌ల్ అయింది. సంగీత్ వేదిక‌ డెకరేష‌న్ థీమ్ ఈ వీడియోలో హైలైట్ గా క‌నిపించింది.

మార్చిలో తాప్సీ కి పెళ్ల‌యిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. ఈ వివాహం ఉదయపూర్‌లో జరిగింది. దీనికి కొద్దిమంది బంధుమిత్రులు మాత్ర‌మే హాజ‌రు కాగా మీడియాకు కూడా స‌మాచారం లేదు. ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మార్చి 20న ప్రారంభమయ్యాయి. ఈ జంట పూర్తిగా చాలా ప్రైవేట్ అండ్ రిజర్వ్డ్ వ్యక్తులు. అందుకే ఎవ‌రినీ పిల‌వ‌లేదు. మీడియాని కూడా ఆహ్వానించ‌లేదు.

తాప్సీ పన్ను.. డానిష్ బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బో 2013లో ప్రారంభమైన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వెంటనే కుటుంబాలు కలుసుకున్నాయి. తాప్సీ తన ల‌వ్ లైఫ్‌కి సంబంధించిన సీక్రెట్స్ ని చాలా వరకు ర‌హ‌స్యంగా దాచి ఉంచింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. X (గతంలో ట్విట్టర్)లో తాము చాట్ చేయడం ప్రారంభించామ‌ని, ఆపై ఒకరినొకరు కలుసుకున్నామ‌ని తాప్సీ తెలిపింది. దశాబ్ద కాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట 2024 మార్చిలో పెళ్లి చేసుకున్నారు.