Begin typing your search above and press return to search.

మాథియాస్ బోకి మ‌తి చెడింది ఇందుకే

తాజాగా తాప్సీ ప‌న్ను షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో గుబులు రేపుతోంది. మునుప‌టి కంటే ముగ్ధ మ‌నోహ‌రంగా క‌నిపిస్తోంది ఈ లుక్ లో.

By:  Tupaki Desk   |   7 Jun 2024 12:30 PM GMT
మాథియాస్ బోకి మ‌తి చెడింది ఇందుకే
X

అవును..! మాథియాస్ బో అందుకే పడిపోయాడు తాప్సీకి. దాదాపు ద‌శాబ్ధ కాలం పాటు సుదీర్ఘంగా ప్రేమాయ‌ణం సాగించిన తాప్సీ ప‌న్ను అత‌డితో ప‌రిచ‌యం అయిన వెంట‌నే పడిపోలేదు. మొద‌టి చూపులోనే ప్రేమ‌లో ప‌డిపోలేద‌ని ఇంత‌కుముందే తాప్సీ వెల్ల‌డించింది. అత‌డు బోలెడ‌న్ని టెస్టులు పాస‌య్యాకే ప్రేమ‌లో ప‌డ్డాన‌ని తాప్సీ తెలిపారు.

అయితే మాథియాస్ బో తాప్సీకి ఎందుకు ప‌డిపోయి ఉండొచ్చు! అంటే.. ఇదిగో ఇక్క‌డ స‌మాధానం స్ప‌ష్టంగా ఉంది. తాప్సీ ఒక తెలుగింటి అమ్మాయిలా.. భార‌తీయ వ‌నితలా చీర‌లో క‌వ్విస్తున్న తీరు దీనికి కార‌ణం కావొచ్చు. విదేశీ వ‌నిత‌ల‌తో పోలిస్తే భార‌తీయ స్త్రీల అందం హొయ‌లు అంతా చీర‌లోనే దాగి ఉంది. అందుకే తాప్సీని చీర‌లో చూసి అత‌డు ఫ్లాట్ అయిపోయి ఉంటాడ‌ని అభిమానులు ఊహిస్తున్నారు.

ప్ర‌ఖ్యాత కాస్మోపాలిట‌న్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాప్సీ త‌న ప్రేమాయ‌ణం గురించి ఓపెనైంది. మాజీ బ్యాడ్మింట‌న్ ఆట‌గాడు, కోచ్ అయిన మాథియాస్ బో ఇటీవ‌లే తాప్సీని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఇది ర‌హ‌స్య పెళ్లి కావ‌డంతో పూర్తిగా బ‌య‌టి ప్ర‌పంచానికి క్లారిటీ లేదు. మ‌రోవైపు తాప్సీ ప‌న్ను పెళ్లి త‌ర్వాత వ‌రుస ఫోటోషూట్ల‌తో అభిమానుల‌కు ట‌చ్ లోకి వ‌స్తోంది.

తాజాగా తాప్సీ ప‌న్ను షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో గుబులు రేపుతోంది. మునుప‌టి కంటే ముగ్ధ మ‌నోహ‌రంగా క‌నిపిస్తోంది ఈ లుక్ లో. ఎర్ర కోక‌లో తాప్సీ అంద‌చందాలు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. అలా న‌ది ఒడ్డున ఆహ్లాదంగా ప్ర‌శాంత‌వ‌ద‌నంతో తాప్సీ ఒక అంద‌మైన పుష్పాన్ని వీక్షిస్తూ మైమ‌రిచిపోయి క‌నిపిస్తోంది.

ఆ రింగుల జుత్తు.. కాలికి క‌ట్టిన తాయ‌త్తు కాంబినేష‌న్ ఏంటో కానీ గ‌మ్మ‌త్త‌యిన తాప్సీ వ్య‌క్తిత్వానికి సింబాలిక్ గా క‌నిపిస్తున్నాయ్. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా దూసుకెళుతోంది. మాథియాస్ బో మ‌తి చెడిపోయింది ఇందుకేనా? అంటూ అభిమానులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

తాప్సీ ప్ర‌స్తుతం న‌టిగా కంటే నిర్మాత‌గా బిజీ అవుతోంది. త‌న సొంత వ్యాపారాల్లోను త‌ల‌మునక‌లుగా ఉంది. న‌టిగా త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ గురించి వివ‌రాలు వెల్ల‌డించాల్సి ఉంది. శ‌భాష్ మిత్తు (మిథాలీ రాజ్ బ‌యోపిక్), డంకీ త‌ర్వాత తాప్సీ యూనిక్ స‌బ్జెక్ట్స్ కోసం అన్వేషిస్తోంది.