Begin typing your search above and press return to search.

ఆ నిబంధనలు పేదవాళ్లకు దురదృష్టకరం : తాప్సి

బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ తాజా చిత్రం 'డంకీ' క్రిస్మస్ కానుకగా విడుదల అయ్యి భారీ వసూళ్లు నమోదు చేసింది

By:  Tupaki Desk   |   25 Jan 2024 2:30 PM GMT
ఆ నిబంధనలు పేదవాళ్లకు దురదృష్టకరం : తాప్సి
X

బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ తాజా చిత్రం 'డంకీ' క్రిస్మస్ కానుకగా విడుదల అయ్యి భారీ వసూళ్లు నమోదు చేసింది. సలార్ కు పోటీగా విడుదల అయిన ఈ సినిమా కు అన్ని ఏరియాల్లో కూడా మంచి వసూళ్లు నమోదు అయినట్లు బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల వారు ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో హీరోయిన్ తాప్సి ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలపై స్పందించింది. అక్రమంగా విదేశాలకు వెళ్లే యువకుల కథ ఆధారంగా డంకీ సినిమా రూపొందింది. విదేశాలకు వెళ్లేందుకు పేదవారికి వీసా లభించడం దాదాపు అసాధ్యంగా ఉంది. అందుకే అడ్డ దారులు తొక్కాల్సి వస్తుంది అనేది చాలా మంది అభిప్రాయం.

తాజాగా తాప్సి మాట్లాడుతూ.. వీసా కోసం అమలు చేస్తున్న నిబంధనలు చాలా కఠినంగా ఉండటం దురదృష్టకరం. ముఖ్యంగా పేద వారు తమ బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బు చూపించలేకపోతున్నారు. అయితే ధనవంతులు మాత్రం కావాల్సినంత డబ్బు ను అకౌంట్‌ లో చూపించి ఈజీగా వీసాను పొందుతున్నారు అంది.

తక్కువ ఆదాయం ఉన్న వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ కారణంతో మా చిత్ర యూనిట్ సభ్యులు కూడా కొందరు వీసా లభించక పోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. యూకే వీసా పొందడంలో డంకీ సినిమాకు చెందిన కొందరు యూనిట్‌ సభ్యులు కూడా ఇబ్బంది పడ్డట్లుగా తాప్సి పేర్కొంది.

డంకీ సినిమా విజయం పట్ల తాప్సి సంతోషాన్ని వ్యక్తం చేసింది. షారుఖ్‌ ఖాన్ వంటి సూపర్ స్టార్ తో నటించడంతో పాటు రాజ్‌ కుమార్‌ హిరాణీ వర్క్ చేయడం కూడా సంతోషాన్ని కలిగించిందని తాప్సి ఇంటర్వ్యూలో పేర్కొంది.